తొలి తెలుగు సమరయోధుడు ఉయ్యాలవాడ
బాపట్ల: బ్రిటిష్ వారి నిరంకుశ విధానాన్ని ఎదిరించిన తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు మున్నం భోగేశ్వరరెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి చేజర్ల నారాయణరెడ్డి తెలిపారు. ఆదివారం ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి సందర్భంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాపట్ల ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్న రోగులకు భోజనం పొట్లాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బ్రిటీష్ వారిపై సాయుధ పోరాటం చేసిన ధీశాలి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని కొనియాడారు. బ్రిటీష్ వారు విధించిన నిరంకుశ పన్ను విధానాలను వ్యతిరేకించి వారి ఖజానాలపై దాడులు చేశారని తెలిపారు. వైఎస్సార్ సీపీ బాపట్ల మండల అధ్యక్షుడు మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు కోకి రాఘవరెడ్డి, యూత్ విభాగం కార్యదర్శి నక్కా వీరారెడ్డి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు వారి లక్ష్మి, కార్యదర్శి కావూరి సుబ్రమణ్యంరెడ్డి, నాయకులు శ్రీనివాసరెడ్డి, జాలిరెడ్డి, పోలిరెడ్డి తదితరులు ఉన్నారు.
సాయుధపోరాట ధీరుడు ఉయ్యాలవాడ
బాపట్లటౌన్: బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనకు వ్యతిరేకంగా రాయలసీమలో సాయుధపోరాటం సాగించిన ధీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని జిల్లా జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. ఉయ్యాలవాడ వర్ధంతిను పురస్కరించుకొని ఆదివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఉయ్యాలవాడ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఎస్పీ బి.ఉమామహేశ్వర్ మాట్లాడుతూ తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అన్నారు. 1857 సిపాయిల తిరుగుబాటుకు పదేళ్ల ముందే 1846–47 కాలంలోనే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనకు వ్యతిరేకంగా రాయలసీమలో సాయుధ పోరాటం చేసిన ధీశాలి నరసింహారెడ్డి అన్నారు. నిరంకుశ పన్ను విధానాలకు వ్యతిరేకంగా సుమారు 5000 మంది రైతులతో సైన్యాన్ని నిర్మించి, కోయిల్‌కుంట్ల, ఎం.ఎం. కడప జిల్లాలోని బ్రిటిష్ ఖజానాలపై దాడులు చేసి వారిని గజగజలాడించారన్నారు. బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన కొత్త భూసేకరణ విధానాలు, పాలెగాళ్ల వ్యవస్థ రద్దు వంటి చర్యలు రైతులపై భారం వేయడంతో నరసింహారెడ్డి తిరుగుబాటు బావుటా ఎగురవేశారన్నారు. వడ్డే ఓబన్న వంటి నమ్మకమైన అనుచరులతో కలిసి కెప్టెన్ వాట్సన్ నాయకత్వంలోని బ్రిటిష్ సైన్యాన్ని గిద్దలూరు వద్ద ఓడించారన్నారు. 1847 ఫిబ్రవరి 22న కోయిల్‌కుంట్లలోని రాళ్ల బురుజు వద్ద వందలాది మంది ప్రజల సమక్షంలో బ్రిటిష్ వారు ఆయన్ను ఉరితీశారని, ఆ రోజున ఆయన వీరమరణం పొందారన్నారు. నరసింహారెడ్డి అపురూప త్యాగానికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 2017లో ఆయన చిత్రపటంతో తపాలా స్టాంప్‌ను విడుదల చేసిందని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టడం గర్వకారణమన్నారు. ఎస్‌బీ సీఐ నారాయణ, ఆర్‌ఐ మౌలుద్దీన్, చుండూరు సీఐ ఆనందరావు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు మున్నం భోగేశ్వరరెడ్డి
తొలి తెలుగు సమరయోధుడు ఉయ్యాలవాడ


