హక్కుల సాధనలో రాజీలేని పోరాటం | - | Sakshi
Sakshi News home page

హక్కుల సాధనలో రాజీలేని పోరాటం

Feb 23 2026 7:29 AM | Updated on Feb 23 2026 7:29 AM

హక్కుల సాధనలో రాజీలేని పోరాటం

హక్కుల సాధనలో రాజీలేని పోరాటం

హక్కుల సాధనలో రాజీలేని పోరాటం లాకర్‌లో పెట్టిన బంగారం మాయం రాష్ట్రస్థాయి సైంటిఫిక్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌కు స్పందన ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం జిల్లా అధ్యక్షుడిగా పాపారావు ఎన్నిక

పల్నాడు ఏపీ జేఏసీ కో–ౖచైర్మన్‌ బెజ్జం సంపత్‌బాబు

యడ్లపాడు: ఏడు దశాబ్దాల ఐక్య పోరాట స్ఫూర్తితో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సమస్యలపై పల్నాడు గడ్డపై నుంచి ఉద్యమిస్తామని ఏపీ జేఏసీ కో–చైర్మన్‌ బెజ్జం సంపత్‌బాబు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం తక్షణమే సీపీఎస్‌ రద్దు చేసి పాతపెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని, అలాగే మెమో 57ను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. 12వ పీఆర్సీ కమిటీని వేయకపోవడం దారుణమని, వెంటనే 30శాతం ఐఆర్‌ ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. గత ఏడేళ్లుగా నిలిచిపోయిన కారుణ్య నియామకాలపై ఆయన ప్రత్యేకంగా స్పందిస్తూ, సుమారు 900 ఉపాధ్యాయ కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన చెందారు. అర్థరహితమైన జీవోలను పక్కనపెట్టి, ప్రభుత్వం స్పెషల్‌డ్రైవ్‌ ద్వారా కలెక్టర్‌ పూల్‌లో తక్షణమే వారికి నియామకాలు జరిపి ఆదుకోవాలని తన ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేసిన బ్యాంకు మేనేజర్‌

తాడికొండ: బ్యాంక్‌ సేఫ్‌ లాకర్‌లో పెట్టిన బంగారు నగలు మాయమైన ఘటన తుళ్లూరు మండలం వెంకటపాలెం యూనియన్‌ బ్యాంకులో జరిగింది. దీనిపై బ్యాంకు మేనేజర్‌ భూక్యా వీరాంజనేయులు నాయక్‌ ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు వివరాల ప్రకారం .02.02.2026 న బ్యాంక్‌ సేఫ్‌ లాకర్‌లో ఉంచిన బంగారు నగల ప్యాకెట్లను తనిఖీ చేయగా 2 పౌచ్‌లలో ఉన్న బంగారు నగలు కనిపించలేదనీ, వాటి మొత్తం నికర బరువు 328 గ్రాములు కలిగి ఉన్నట్లు, ప్రాథమిక అంతర్గత తనిఖీ, సీసీటీవీ ఫుటేజ్‌ పరిశీలనలో, అదే బ్రాంచ్‌లో పనిచేసే బ్యాంక్‌ ఉద్యోగి అనుమతి లేకుండా సేఫ్‌ లాకర్‌ తాళం చెవి తీసుకొని లాకర్‌ ఉన్న పై రెండు బంగారు పౌచ్‌లు తీసుకెళ్లినట్లు నిర్ధారించుకున్నారు. అనంతరం 21.02.2026న తుళ్ళూరు పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు.

గుంటూరు ఎడ్యుకేషన్‌: ఆంధ్రప్రదేశ్‌ అన్‌ ఎయిడెడ్‌ స్కూల్స్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ (అపుస్మా), ఈ–అభ్యాస్‌ అకాడమీ సంయుక్తంగా రాష్ట్రస్థాయిలో నిర్వహించిన ‘సైంటిఫిక్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (శాట్‌) – లెవెల్‌ టు ఒలింపియాడ్‌‘ ప్రతిభా పరీక్షలకు విశేష స్పందన లభించినట్లు అపుస్మా రాష్ట్ర అధ్యక్షుడు కొలసాని తులసి విష్ణు ప్రసాద్‌ పేర్కొన్నారు. ఆదివారం అరండల్‌పేటలోని కెనడీ హైస్కూల్లో పరీక్ష పత్రాలను ఆవిష్కరించారు. విష్ణుప్రసాద్‌ మాట్లాడుతూ ఈ–అభ్యాస్‌ అకాడమీ సహకారంతో ’శాట్‌’ ఒలింపియాడ్‌ ప్రతిభ పరీక్ష రెండు దశల్లో నిర్వహిస్తున్నామని చెప్పారు. హైస్కూల్‌ స్థాయిలో విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం, విశ్లేషణాత్మక నైపుణ్యం, తార్కిక ఆలోచనలను ప్రోత్సహిస్తూ గ్లోబల్‌ విద్యార్థులుగా రాణించేందుకు అపుస్మా జాతీయస్థాయిలో కృషి చేస్తోందని తెలిపారు. ఈ–అభ్యాస్‌ అకాడమీ చైర్మన్‌ డాక్టర్‌ భువనగిరి ఫణి పవన్‌శాస్త్రి, సీఈఓ బి.సాయి రామకృష్ణ మాట్లాడుతూ జనవరి 18న రాష్ట్రంలోని 125కు పైగా అపుస్మా అనుబంధ పాఠశాల్లో నిర్వహించిన శాట్‌ ఒలింపియాడ్‌ తొలి దశ పరీక్షకు 15వేల మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థుల్లో 3వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ప్రతి తరగతి నుంచి 1,2,3 ర్యాంకులు సాధించిన విద్యార్థులకు రెండవ దశ ప్రతిభ పరీక్ష నిర్వహించామని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 కేంద్రాల్లో ఆరువేల మందికి పైగా విద్యార్థులకు శాట్‌ ఒలింపియాడ్‌ పరీక్షను ‘ఓఎంఆర్‌’ విధానంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రెండవ దశలో రాష్ట్రస్థాయిలో 1,2,3 ర్యాంకులు సాధించిన విద్యార్థులకు మార్చి 8న గుంటూరులో జరగనున్న బహుమతి ప్రదానోత్సవంలో నగదు, ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేయనున్నట్లు వివరించారు. అపస్మా రాష్ట్ర నాయకులు కె.శ్రీకాంత్‌బాబు, విజ్‌డమ్‌ రవి, చైతన్య సాంబిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు నాయుడు చక్రనాగ్‌ పాల్గొన్నారు.

కొరిటెపాడు(గుంటూరు): ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడుగా వేంపాటి పాపారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంఘం జిల్లా కార్యాలయంలో ఆదివారం సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశంలో నామినేషన్లు దాఖలు చేసిన నలుగురు సభ్యులతో సంఘం సభ్యులు చర్చలు జరిపారు. దీంతో బీసీహెచ్‌ నాగులు, కె.నాగేశ్వరరావు, ఎ.కోటయ్యలు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో సంఘం జిల్లా అధ్యక్షుడుగా పాపారావు ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అలాగే సంఘం అసోసియేట్‌ అధ్యక్షుడుగా జె.మునిబాబు, గౌరవాధ్యక్షుడుగా బీసీహెచ్‌ నాగులు, కార్యవర్గ సభ్యులుగా కె.నాగేశ్వరరావు, ఎ.కోటయ్య, జె.ఏడుకొండలు, పి.నరసింహనాయుడు, ఎస్‌.భాస్కరబాబు, షాదిక్‌ బాషా, షేక్‌ మహబూబ్‌ సుభానిలు ఎన్నికయ్యారు. కార్యక్రమానికి ఎన్నికల అధికారిగా సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు డీఎస్‌ కోటయ్య వ్యవహరించారు. నూతన అధ్యక్షుడు పాపారావు మాట్లాడుతూ ప్రభుత్వ డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానన్నారు. పూర్తిస్థాయి కమిటీని త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర నాయకులు బి.శ్రీనివాసరావు, వి.ప్రసన్నాంజనేయ కుమార్‌, ప్రభుత్వ వాహన డ్రైవర్లు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికై న పాపారావును పలువురు ప్రభుత్వ వాహన డ్రైవర్లు కలిసి అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement