ప్రతి పల్లెలో వైఎస్సార్‌ సీపీ జెండాను ఎగురవేయాలి | - | Sakshi
Sakshi News home page

ప్రతి పల్లెలో వైఎస్సార్‌ సీపీ జెండాను ఎగురవేయాలి

Mar 2 2026 7:44 AM | Updated on Mar 2 2026 7:44 AM

ప్రతి పల్లెలో వైఎస్సార్‌ సీపీ జెండాను ఎగురవేయాలి

ప్రతి పల్లెలో వైఎస్సార్‌ సీపీ జెండాను ఎగురవేయాలి

ప్రతి పల్లెలో వైఎస్సార్‌ సీపీ జెండాను ఎగురవేయాలి

మేడికొండూరు: ప్రతి పల్లెలోనూ వైఎస్సార్‌ సీపీ జెండాను ఎగురవేయాలని తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు అన్నారు. మండలంలోని సిరిపురం గ్రామంలో వివిధ విభాగాల కమిటీ అభ్యర్థులతో నిర్వహించిన నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన హాజరై మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను నిండా ముంచిందని విమర్శించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు పార్టీకి పునాదులని వివరించారు. పార్టీ కోసం పనిచేసే గ్రామ, మండలస్థాయిలోని వివిధ విభాగాల కమిటీ సభ్యులు, కార్యకర్తలకు మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. పార్టీని మరింత పటిష్టం చేసేందుకు ప్రతి గ్రామంలోని నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లోని టీడీపీ దౌర్జన్యాలు, అవినీతిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. మరోసారి జగనన్నను ముఖ్యమంత్రి చేసుకునేందుకు అందరూ కంకణ బద్దులుగా కావాలన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తాళ్లూరు వంశీకృష్ణ, సిరిపురం గ్రామ పార్టీ అధ్యక్షులు కంకణాల పరమేశ్వరరావు, జోసఫ్‌ రెడ్డి, మండల మహిళా అధ్యక్షురాలు కాసు విజయమ్మ రాయప్ప రెడ్డి, వైస్‌ ప్రెసిడెంట్‌ సాంబశివరావు, స్టేట్‌ ఐటీ వింగ్‌ ప్రధాన కార్యదర్శి గుంటుపల్లి ప్రదీప్‌ గొంది రవి, మిరియాల శివరామకృష్ణ, ఏరా బాబు, కన్నయ్య, అబ్దుల్లా, హబీబుల్లా, ఇక్బాల్‌, కరిముల్లా, విద్యాసాగర్‌, తదితర గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త

వజ్రబాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement