అంతర జిల్లాల దొంగలు అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

అంతర జిల్లాల దొంగలు అరెస్ట్‌

Mar 3 2026 8:09 AM | Updated on Mar 3 2026 8:09 AM

అంతర జిల్లాల దొంగలు అరెస్ట్‌

బాపట్లటౌన్‌: ఒంటరిగా వెళుతున్న మహిళలనే లక్ష్యంగా చేసుకొని చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న దొంగలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం ఎస్పీ వివరాలు వెల్లడించారు. బాపట్ల మండలం ముత్తాయపాలెంలో మహిళా పోలీస్‌ కర్రి లక్ష్మి ప్రసన్న 2025 అక్టోబర్‌ 29న స్కూటీపై పోతనకట్టవారిపాలెం వెళ్తుండగా దుండగులు మెడలోని చైన్‌ లాక్కెళ్ళారు. కేసు నమోదుచేసుకొని దర్యాప్తు నిర్వహించగా గుంటూరు జిల్లా నల్లపాడులోని చల్లావారిపాలెం గ్రామానికి చెందిన పట్నాల వెంకట దుర్గాప్రభు అలియాస్‌ అఖిల్‌, గుంటూరులోని శారద కాలనీకు చెందిన షేక్‌ రాజాలను గుర్తించి అదుపులోకి విచారించామని చెప్పారు.

విలాసాల కోసమే నేరాలు ..

నిందితుడు అఖిల్‌ ఎంబీఏ పూర్తిచేసి గుంటూరు పట్టణంలో జిమ్‌ సెంటర్‌ నిర్వహిస్తుండేవారు. వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో రాజాతో కలిసి మహిళలనే టార్గెట్‌ చేసుకొని మెడలో గొలుసులు దొంగలించారు. వీరి నుంచి మొత్తం 129.57 గ్రాముల బంగారం వస్తువులును, మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. చైన్‌ స్నాచర్లను పట్టుకొనడంలో ప్రతిభ చూపించిన బాపట్ల డీఎస్పీ పి.జగదీష్‌ నాయక్‌, బాపట్ల రూరల్‌ సిఐ బి.హరిక్రిష్ణ, సిసిఎస్‌ సీఐ పి.ప్రేమయ్య, ఎస్‌.ఐ బాబురావు, కర్లపాలెం ఎస్‌.ఐ ఎస్‌.రవీంద్ర, కానిస్టేబుల్‌ వి.శివ శంకర్‌, ఐటి కోర్‌ కానిస్టేబుల్‌ లు యు.రాజేష్‌, కె.రాము, కర్లపాలెం హోంగార్డ్‌ ఎం.రమేష్‌ లను అభినందించారు. అనంతరం నగదు బహుమతి అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement