డ్రగ్స్ మహమ్మారిని తరిమికొడదాం
తెలంగాణ రాష్ట్ర జీఎస్టీ జాయింట్ కమిషనర్ శ్రీ లీల
తెనాలి టౌన్: మాదకద్రవ్యరహిత సమాజ నిర్మాణంలో ప్రభుత్వం చేస్తున్న కృషిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని తెలంగాణ రాష్ట్ర జీఎస్టీ జాయింట్ కమిషనర్ యడ్ల శ్రీలీల సూచించారు. రూరల్ మండలం కొలకలూరు గ్రామంలో శ్రీ భారత్ ఫౌండేషన్, ఎకై ్సజ్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత గ్రామంలో విద్యార్థులతో కలిసి ర్యాలీని నిర్వహించారు. అనంతరం గ్రామ పురవేదిక వద్ద ఏర్పాటు చేసిన సభలో జీఎస్టీ జాయింట్ కమిషనర్ యడ్ల శ్రీలీల మాట్లాడారు. డ్రగ్స్ మహమ్మారి దేశ యువతను నిర్వీర్యం చేస్తుందని అన్నారు. వాటి నిర్మూలనకే ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు. ఎకై ్సజ్ సూపరిండెంట్ వి.అరుణ కుమారి మాట్లాడుతూ, ప్రజా చైతన్యం తోనే మత్తు పదార్ధ రహిత సమాజాన్ని నిర్మించుకోగలమని అన్నారు. ఏఈఎస్ మారయబాబు మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి విక్రయాలు, సేవనం వివరాలు తెలిస్తే 1972 టోల్ ఫ్రీ నెంబర్‌కు తక్షణమే సమాచారం ఇవ్వాలని కోరారు. పొన్నెకంటి చక్రవర్తి వ్యాఖ్యాతగా వ్యవహరించిన సభలో తెనాలి ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్ కె.వి.చలం, ఎకై ్సజ్ ఈగల్ ఎస్‌ఐ సునీల్, ఏపీ అసోసియేషన్ సైకాలజిస్ట్ డాక్టర్ కె.శ్రీనివాస్, తన్నీరు కళ్యాణ్ కుమార్, నవజీవన్ బాల భవన్ నిర్వాహకురాలు కవిత, స్క్వేర్డ్ ఇన్‌స్పెక్టర్ నారాయణ తార, యడ్ల శ్రీధర్, గూడూరు చంద్రం, వల్లూరు అజయ్, గ్రామ మాజీ సర్పంచ్ వల్లూరు వరప్రసాద్, విశ్రాంత ఉపాధ్యాయులు తన్నీరు సుబ్బారావు, ‘చిన్నారి స్నేహం‘ మిత్ర మండలి సభ్యులు పాల్గొన్నారు.


