అంబటిపై పథకం ప్రకారమే దాడి | - | Sakshi
Sakshi News home page

అంబటిపై పథకం ప్రకారమే దాడి

Feb 19 2026 9:49 AM | Updated on Feb 19 2026 9:49 AM

అంబటి

అంబటిపై పథకం ప్రకారమే దాడి

అంబటిపై పథకం ప్రకారమే దాడి

మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి

గుంటూరులో అంబటి రాంబాబు కుటుంబ సభ్యులకు పరామర్శ

నగరంపాలెం(గుంటూరు వెస్ట్‌) / పట్నంబజారు (గుంటూరు ఈస్ట్‌) : గుంటూరులోని మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులు విజయలక్ష్మి, మౌనిక, మనోజ్ఞలను మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాదరెడ్డిలు బుధవారం పరామర్శించారు. విధ్వంసమైన ఇల్లు, కార్యాలయాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

●మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ అంబటి రాంబాబుపై ఒక పథకం ప్రకారమే దాడికి ఒడిగట్టారని అన్నారు. గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి, 200 మందితో అంబటి రాంబాబు ఇల్లు, కార్యాలయం వద్దకు వచ్చి విధ్వంసకాండ స్పష్టించడం ఏంటని ప్రశ్నించారు.

● ప్రజల ద్వారా ఎన్నికై న ప్రభుత్వమైతే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అమలవుతుందని, కానీ ఈవీఎంల ద్వారా విచిత్రంగా కూటమి ప్రభుత్వంఎన్నికై ందని చెప్పారు. ఇంతటి అరాచక ప్రభుత్వాన్ని ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో చూడలేదన్నారు.

●ఈవీఎంలపై ఇటీవల ఒకరూ కూలంకుషంగా చెప్పారని, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ఎన్నేసి ఓట్లు పడ్డాయనేది వివరించారని అన్నారు. ఒక నిమిషానికి ఎవరైనా తొమ్మిది ఓట్లు వేయగలరా అని ఆయన ప్రశ్నించారు. ఈవీఎంలపై ఇప్పటి వరకు ఎల్లో మీడియా నోరు తెరవలేదని, వారికి పేపర్లు ఉన్నాయని, వారి చేతుల్లో మాఫియా ఉందని, డబ్బు ఉందని, మద్యం ఉందని ఆరోపించారు.

●రాష్ట్రంలో పోలీస్‌ వ్యవస్థ దిగజారిపోయిందని, ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్‌ వ్యవస్థ చంద్రబాబుకు రక్షణగా నిలిచారని ఆరోపించారు.

● 164 సీట్లతో గెలిచి ఏం సాధించారని మండిపడ్డారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటైనా అమలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం పదేపదే తప్పులు చేస్తుందని, అయితే ఎల్లో మీడియా ఎందుకు ఇంతగా మౌనంగా ఉంటుదంటే ఒకరికి చైర్మన్‌ పదవి, ఒకాయనకు గుత్తేదారు పనులు, మరొకరికి వేల కోట్ల ఖరీదు చేసే భూములు అప్పగించారని ఆరోపించారు.

దాడి హేయమైన చర్య...

● దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో దాడులు జరుగుతుంటే కూటమి నేతలు వాటిని ప్రోత్సహించడం సిగ్గుచేటన్నారు.

● రాష్ట్ర హోం శాఖ మంత్రి మహిళ అయి ఉండి, మహిళలపై దాడిచేసి, ఒక హింసాత్మక వాతావరణం సృష్టిస్తే కనీసం పట్టించుకోకపోవడం సరికాదన్నారు.

● నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘ రాజకీయం అనుభవం ఉన్న అంబటి నివాసంపై దాడి హేయమైన చర్య అని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగానే టీడీపీ నేతలు, కార్యకర్తలు గుండాలు అంబటి నివాసంపై దాడి చేశారన్నారు.

కార్యక్రమంలో పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, తాడికొండ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గంగాధరం నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జి కృపాలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

అంబటిపై పథకం ప్రకారమే దాడి 1
1/1

అంబటిపై పథకం ప్రకారమే దాడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement