హైడ్రోపోనిక్స్ సాగు పద్ధతులతో రైతులకు మేలు
బాపట్ల: హైడ్రోపోనిక్స్ (మట్టి లేని) సాగు.. నేటి స్మార్ట్, సుస్థిర వ్యవసాయ పద్ధతులు రైతులకు ఎంతో మేలు చేస్తాయని ఎన్జీరంగా వ్యవసాయ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ ఆర్.శారదా జయలక్ష్మి పేర్కొన్నారు. బాపట్లలోని డాక్టర్ ఎన్టీఆర్ వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాలలో హైడ్రోపోనిక్స్ మట్టి లేని సాగు నేటి స్మార్ట్, సుస్థిర వ్యవసాయ పద్ధతులపై శిక్షణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈశిక్షణ కార్యక్రమంలో డాక్టర్ ఆర్.శారదా జయలక్ష్మి మాట్లాడుతూ ఈశిక్షణ శిబిరంలో 13మంది కృషి విజ్ఞాన్ కేంద్రం శాస్త్రవేత్తలు పాల్గొనటం సంతోషకరమన్నారు. రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించటం ఉపయోగకరమన్నారు. హైడ్రోపోనిక్స్ మట్టి లేని సాగు వల్ల తక్కువ నీటి వినియోగంతో పంటను పండించుకోవచ్చని, అందువల్ల రైతులు మంచి ఆదాయం పొందేందుకు అవకాశం ఉందని చెప్పారు. యూనివర్సిటీ పరిధిలోని 18 కాలేజీలు 33 పరిశోధన కేంద్రాల్లో ఈ సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించినట్లు తెలిపారు. అసోసియేట్ డీన్ డాక్టర్ డీడీ స్మిత్, డీన్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ డాక్టర్ ఎ.మణి, డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ డాక్టర్ జి.శివనారాయణ, వ్యవసాయ కళాశాల డీన్ డాక్టర్ పి.ప్రసన్న రాణి, అసోసియేట్ డీన్ డాక్టర్ ఈఈ స్మిత్, ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ డాక్టర్ కృపావతి, డాక్టర్ జి.రవిబాబు, డాక్టర్ బి.శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్ ఎస్.విష్ణు వర్ధన్ పాల్గొన్నారు.
వీసీ డాక్టర్ ఆర్.శారదా జయలక్ష్మి


