అర్జీలు పునరావృతం కాకూడదు | - | Sakshi
Sakshi News home page

అర్జీలు పునరావృతం కాకూడదు

Mar 3 2026 8:08 AM | Updated on Mar 3 2026 8:08 AM

అర్జీలు పునరావృతం కాకూడదు

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌

బాపట్ల: పీజీఆర్‌ఎస్‌ అర్జీలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి. వినోద్‌ కుమార్‌ తెలిపారు. పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమం కలెక్టర్‌ అధ్యక్షతన సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 135 మంది అర్జీదారులు తమ వినతిపత్రాలను కలెక్టర్‌కు అందజేశారు. కొన్ని పరిష్కరించగా, మిగతావి పరిశీలిస్తున్నారు. అర్జీలను అదే రోజు 24 గంటల్లోగా పరిష్కరించాలని కలెక్టర్‌ ఆదేశించారు. అదే రోజు అధికారులు క్షేత్ర పరిశీలన చేయాలని సూచించారు. ప్రజలకు తక్షణమే ఊరట లభించాలంటే వేగంగా పరిష్కారం చూపాలన్నారు. రిజిస్ట్రేషన్‌ శాఖలో 127 అర్జీలు పునరావృతం కావడంపై ప్రశ్నించారు. అలాగే మరికొన్ని శాఖలలోనూ ఇదే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఐజీఓటీ ఆన్‌లైన్‌ శిక్షణలు ప్రతి ఉద్యోగి పూర్తి చేయాలని పేర్కొన్నారు. శ్మశానాలకు వెంటనే భూములు కేటాయించాలన్నారు. ఎన్నికలకు సంబంధించిన దరఖాస్తులు తక్షణమే పరిష్కరించాలన్నారు. నూతన ఓటర్లు నమోదు, తొలగింపులపై వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్‌ భావన వశిష్ట, డీఆర్‌ఓ జి.గంగాధర్‌ గౌడ్‌, ఉప కలెక్టర్‌ లవన్న, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement