విద్యుదాఘాతంతో ఉప్పు రైతు మృతి
చినగంజాం: విద్యుదాఘాతంతో ఓ ఉప్పు రైతు మృతి చెందిన ఘటన శుక్రవారం సాయంత్రం చినగంజాంలోని ఉప్పు కొఠారు భూముల్లో చోటు చేసుకుంది. బంధువులు అందించిన వివరాలు.. మండలంలోని సోపిరాల గ్రామానికి చెందిన పల్లపోలు శ్రీకాంత్(40) తన ఉప్పు కొఠారు భూముల్లో పనులు కోసం వెళ్లాడు. ఆ సమయంలో కొఠారు భూమిలోని విద్యుత్ మోటారుకు సంబంధించిన సర్వీసు వైరు జాయింట్ ఉన్న ప్రాంతం తన మెడకు చుట్టుకోవడం, తన కాలి కింద నీటి తడి ఉండటంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఒక బాబు, పాప ఉన్నారు. శ్రీకాంత్ మృతితో ఆయన కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు.


