ప్రజల మనోభావాలు దెబ్బ తీసిన చంద్రబాబు | - | Sakshi
Sakshi News home page

ప్రజల మనోభావాలు దెబ్బ తీసిన చంద్రబాబు

Feb 28 2026 7:28 AM | Updated on Feb 28 2026 7:28 AM

ప్రజల మనోభావాలు దెబ్బ తీసిన చంద్రబాబు

ప్రజల మనోభావాలు దెబ్బ తీసిన చంద్రబాబు

ప్రజల మనోభావాలు దెబ్బ తీసిన చంద్రబాబు

యద్దనపూడి: రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసే చర్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఇకనైనా మానుకొని పాలనపై పూర్తి దృష్టి సారించాలని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలెపోగు రాంబాబు పేర్కొన్నారు. మండల కేంద్రం యద్దనపూడిలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. బీజేపీ పొత్తులో ఉన్న దృష్ట్యా సీఎం చంద్రబాబు వారి మెప్పుకోసం హిందువులపై ప్రత్యేక ప్రేమ కనబరుస్తున్నట్లుగా నటిస్తూ కలియుగ దైవం పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు, చేప కొవ్వు కలిసిందని ఆరోపణలు చేశారన్నారు. రాష్ట్ర జనాభాలో 40 శాతం ఓటింగ్‌ కలిగి ఉన్న వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని హిందూ సమాజానికి దూరం చేయాలనే దురుద్దేశంతో ముఖ్యమంత్రి హోదాలో ఎటువంటి ఆధారాలు లేకుండా నిందలు వేయడం దారుణమన్నారు. అందుకు వంత పాడుతూ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ లక్ష లడ్డులూ అయోధ్యకు పంపించారంటూ ఆరోపించడం ఎంతవరకు సమంజమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లి అంజనీ ప్రసాదరెడ్డి,వైస్‌ ఎంపీపీ ఐమాల శాంసన్‌, పార్టీ సీనియర్‌ నాయకులు జంపాని కోటి తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి

రాంబాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement