రేపల్లె ఇన్‌చార్జి ఆర్డీఓగా గ్లోరియా
రేపల్లె: రేపల్లె రెవెన్యూ డివిజనల్ ఇన్‌చార్జి అధికారిగా గ్లోరియా నియమితులయ్యారు. బాపట్ల ఆర్డీవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆమె రేపల్లె ఆర్డీవోగా అదనపు బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆర్డీవోగా పనిచేసిన నేలపు రామలక్ష్మి 2018 గ్రూప్ –2 ఫలితాల కోర్టు వివాదాల నేపథ్యంలో బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో గ్లోరియా నియమితులయ్యారు.
ఢిల్లీలో అవార్డు అందుకున్న శరత్‌బాబు
మార్టూరు: మండలంలోని బబ్బేపల్లి గ్రామానికి చెందిన యువరైతు పెంట్యాల శరత్‌బాబు శుక్రవారం ఢిల్లీలో అరుదైన పురస్కారం అందుకున్నారు. ఆధునిక సాంకేతిక పద్ధతులు, ప్రకృతి సేద్యం ద్వారా వ్యవసాయం చేస్తున్న ఔత్సాహిక రైతులను ఢిల్లీకి చెందిన కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సంస్థ (ఐసీఏఆర్) దేశవ్యాప్తంగా 35 మంది రైతులను ఎంపిక చేశారు. అందులో భాగంగా రాష్ట్రానికి చెందిన మండలంలోని బబ్బేపల్లి గ్రామానికి చెందిన పెంట్యాల శరత్‌బాబును గుర్తించారు. 11 ఏళ్లుగా వ్యవసాయంలో చేస్తున్న నిరంతర కృషిని గుర్తించి అవార్డు(2026)కు ఎంపిక చేశారు. ఢిల్లీలో ఫిబ్రవరి 25 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించిన పూస కృషి విజ్ఞాన్ మేళాలో డాక్టర్ ఆర్‌ఎస్ పరోడా, డాక్టర్ శ్రీనివాసరావు, డైరెక్టర్ ఆఫ్ ఐఆర్‌ఏఐ ఆర్యన్ పడారియ చేతుల మీదగా శరత్ బాబు అవార్డు అందుకున్నారు.
బాపట్ల: రైతులకు అందిస్తున్న హైడ్రోఫోనిక్స్ కిట్లను సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాల డీన్ డాక్టర్ డీడీ స్మిత్ పేర్కొన్నారు. కళాశాలలో 30 మంది రైతులకు హైడ్రోఫోనిక్స్ యూనిట్లు పంపిణీ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. రైతులను ఉద్దేశించి డాక్టర్ స్మిత్ మాట్లాడుతూ రైతులని ఉద్దేశించి మట్టి లేకుండా కేవలం పోషకాలు కలిపిన నీటిని ఉపయోగించి మొక్కలను పెంచే ఆధునిక వ్యవసాయ పద్ధతిని అందించటం సంతోషకరమని పేర్కొన్నారు. నేలకి బదులుగా మొక్కల వేర్లను అవసరమైన పోషకాలను నేరుగా నీటిని అందిస్తారు. ఇది తక్కువ స్థానంలో తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి ఇచ్చే ఏడాది పొడవునా సాగు చేయగల పద్ధతిని వివరించారు. కార్యక్రమంలో డాక్టర్ జి.రవి బాబు, కె.ధనరాజ్, విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ పి.రమేష్, డాక్టర్ విష్ణు పాల్గొన్నారు.
రేపల్లె ఇన్‌చార్జి ఆర్డీఓగా గ్లోరియా
రేపల్లె ఇన్‌చార్జి ఆర్డీఓగా గ్లోరియా


