హనుమంత వాహనంపై నృసింహుడు
మంగళగిరిటౌన్:మంగళాద్రిలో వేంచేసి యున్న శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు మంగళవారం రాత్రి స్వామివారిని హనుమంత వాహనంపై గ్రామోత్సం నిర్వహించారు. అభయ ప్రదాత అయిన హనుమంతుని భుజ స్కందాలపై లక్ష్మీ నరసింహస్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. గ్రామోత్సవంలో మహిళల కోలాట ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. ఈ ఉత్సవానికి తిలకించి, సేవించిన వారందరికీ సత్‌బుద్ధిని, అభయా న్ని ప్రసాదిస్తారని భక్తుల నమ్మకం. ఆలయ ఈవో కె.సునీల్‌కుమార్ ఉత్సవాన్ని పర్యవేక్షించగా దుగ్గిరాల మండలం పెదపాలెం గ్రామానికి చెందిన వాసిరెడ్డి మల్లేశ్వరరావు (రాజేష్) కై ంకర్యపరులుగా వ్యవహరించారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి 7 గంటలకు శ్రీవారు రాజాధిరాజ వాహనంపై గ్రామోత్సవంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.


