భావితరాల కోసం తాళపత్ర గ్రంథాల డిజిటలైజేషన్‌ | - | Sakshi
Sakshi News home page

భావితరాల కోసం తాళపత్ర గ్రంథాల డిజిటలైజేషన్‌

Feb 20 2026 6:37 AM | Updated on Feb 20 2026 6:37 AM

భావితరాల కోసం తాళపత్ర గ్రంథాల డిజిటలైజేషన్‌

భావితరాల కోసం తాళపత్ర గ్రంథాల డిజిటలైజేషన్‌

భావితరాల కోసం తాళపత్ర గ్రంథాల డిజిటలైజేషన్‌

ప్రముఖ నాడీ వైద్యుడు శశిధర్‌

చీరాల రూరల్‌: భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్‌ తరాలకు అందించేందుకే పురాతన తాళపత్ర గ్రంథాలను తెలుగులోకి తర్జుమాచేసి డిజిటలైజేషన్‌ చేస్తున్నట్లు సనాతన జీవన్‌ ట్రస్టు చైర్మన్‌, నాడీ వైద్య నిపుణుడు జి. శశిధర్‌ అన్నారు. గురువారం చీరాల కొత్తపేటలోని సనాతన జీవన్‌ ట్రస్టు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇలాంటి బృహుత్తర కార్యక్రమం ఇంతవరకు ఏ రాష్ట్రంలో జరగలేదని తెలిపారు. రాగిరేకులు, తాటాకులు ఇతర వాటిపై పురాతన దేవ నాగరి లిపి, దేవ లిపి, సంస్కృతంలో రాసేవారని గుర్తుచేశారు. ప్రస్తుతం వాటన్నింటిని సేకరించి రుసుం తీసుకోకుండా ఆర్గానిక్‌ వంటి రసాయనాలతో శుద్ధిచేసి తెలుగులోకి తర్జుమాచేసి డిటిలైజేషన్‌ చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు 12 లక్షలకుపైగా తాళపత్ర గ్రంథాలను రూ.కోట్లాది రూపాయలు సొంత నిధులు వెచ్చించి డిటిలైజేషన్‌ చేసినట్లు చెప్పారు. చీరాల, తిరుపతిలో మాత్రమే ఈ డిటిలైజేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement