సాగునీటిపై ఆందోళన వద్దు
నరసరావుపేట రూరల్: పంట పొలాలకు ఈనెల 25వ తేదీ వరకు నీటి సరఫరా ఉంటుందని ఎన్‌ఎస్‌పీ డీఈ ఎం.ఉమాశంకర్ తెలిపారు. పల్నాడు జిల్లా వ్యవసాయ అధికారి ఎం.జగ్గారావు, ఏడీఏ కేవీ శ్రీనివాసరావుతో కలిసి గురువారం కేఎం అగ్రహరంలో పర్యటించారు. మొక్కజొన్న పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. నీటి కోసం ఆందోళన చెందవద్దని అధికారులు తెలిపారు. పంటలకు సరిపడా నీటి సరఫరా ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మొక్కజొన్న కండే దశలో ఉన్నందున అంతరాయం లేకుండా నీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు.


