బాపట్ల
ఈపూరుపాలెం స్ట్రయిట్‌కట్ నుంచి వేటపాలెం స్ట్రయిట్‌కట్ వరకు తీరం వెంట పలుచోట్ల ఆక్రమణలు తాజాగా మంత్రి లోకేష్ మనుషుల కన్ను అందులో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఓ ఎమ్మెల్యే సోదరుడు, రాజ్యసభ రేసులో ఉన్న ఓ నాయకుడు, హైదరాబాద్‌కు చెందిన ఓ రియల్ వ్యాపారి అడుగులు తీరప్రాంత అభివృద్ధికి గోవా పర్యటన చేసిన కలెక్టర్ బృందం ఈ క్రమంలోనే తీరప్రాంత ఆక్రమణలపై కూడా దృష్టి సారించాలని కోరుతున్న ప్రజలు
న్యూస్‌రీల్
తీరంపై మంత్రి లోకేష్ మనుషుల కన్ను...
వేటపాలెం స్ట్రయిట్‌కట్‌కు పొట్టిసుబ్బయ్యపాలేనికి మధ్య తీరప్రాంతంపై మంత్రి లోకేష్ మనుషులుగా గుర్తింపు పొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఓ ఎమ్మెల్యే సోదరుడు, రాజ్యసభ రేసులో ఉన్న నాయకుడు, హైదరాబాద్‌కు చెందిన ఓ రియల్ వ్యాపారి, మరో వ్యక్తి మొత్తం నలుగురు సిండికేట్‌గా పాగా వేసేందుకు పావులు కదుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
అందులో భాగంగా చీరాలకు చెందిన ఓ బడా బాబు భూములు కొనుగోలు చేసి ఎదురుగా ఉన్న తీరప్రాంతాన్ని కబ్జా చేసేందుకు అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అక్కడ స్ట్రయిట్‌కట్ నుంచి వాలును పూడ్చేందుకు కూడా కార్యాచరణ చేపట్టినట్లు చెప్పుకుంటున్నారు. అలా జరిగితే ఈపూరుపాలెం స్ట్రయిట్‌కట్ వాలు పూడ్చిన కథ ఇక్కడ పునరావృతమయ్యే పరిస్థితి ఉందనే ప్రచారం జరుగుతోంది.
ఈ క్రమంలో ఆ బడాబాబు మత్స్యకారుల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండేందుకు సామ, దాన, భేదోపాయాలను ప్రయోగించినట్లు చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే సదరు భూములలో కొంతమేర ప్రభుత్వ భూమి ఉందని కూడా సమాచారం.
మంగళవారం శ్రీ 24 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
తెనాలి:తెనాలి మార్కెట్‌యార్డులో సోమవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.6,000, గరిష్ట ధర రూ.7,600, మోడల్ ధర రూ.7,000 వరకు పలికింది.
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 539.80 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 24,222 క్యూసెక్కు లు వచ్చి చేరుతోంది.
అర్జీలను వెంటనే పరిష్కరించాలి
జిల్లా జాయింట్ కలెక్టర్ భావన వశిష్ట
బాపట్ల: ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్)లో నమోదైన అర్జీలను గడువులోగా పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ భావన వశిష్ట తెలిపారు. పీజీఆర్‌ఎస్ కార్యక్రమం సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు సమస్యలు పరిష్కరించాలంటూ అర్జీలు అందజేశారు. తన పరిధిలోని వాటికి తక్షణమే ఆమె పరిష్కార మార్గం చూపారు. కొన్నింటిని పరిశీలనకు, మరికొన్నింటిని విచారించించాలని సంబంధిత అధికారులకు బదలాయించారు. అన్ని మండలాల తహసీల్దార్లతో వీక్షణ సమావేశం నిర్వహించి సమస్యల పరిష్కారంపై అడిగి తెలుసుకున్నారు. తన పరిధిలో లేని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తామని హామీ ఇచ్చారు. పీజీఆర్‌ఎస్‌లో 197 అర్జీలు నమోదయ్యాయి. నమోదైన అర్జీలను నిశితంగా పరిశీలించిన తదుపరి పరిష్కరించాలన్నారు. గడువు తీరిన అర్జీలు పెండింగ్‌లో లేకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజలకు మేలు జరగాలంటే అధికారులంతా చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. అధికారుల పనితీరుతోనే ప్రజల సంతృప్తి స్థాయి పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి డీఆర్వో లవన్న, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్ విజయమ్మ, గుంటూరు జెడ్పీ డిప్యూటీ సీఈవో కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
చీరాల అర్బన్: జిల్లాలో తీరప్రాంత అభివృద్ధికి, పర్యాటక రంగాన్ని విస్తరించేందుకు కలెక్టర్ వి.వినోద్‌కుమార్ బృందం గోవాలో అధ్యయన పర్యటన చేసి వచ్చారు. అభివృద్ధికి చేపట్టిన ఆ చర్యలను స్వాగతించాల్సిందే. అయితే, పలుచోట్ల తీరం పరాధీనం అవుతోంది. ఆక్రమణదారులు ఒకరిని చూసి మరొకరు ఆక్రమణలకు తెగబడుతున్నారు. ఈపూరుపాలెం స్ట్రయిట్‌కట్ నుంచి వేటపాలెం స్ట్రయిట్‌కట్ వరకు పలుచోట్ల తీరప్రాంతాన్ని కబ్జా చేసి తమ వ్యాపారాలను విస్తరించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి లోకేష్ మనుషులుగా గుర్తింపు పొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఓ ఎమ్మెల్యే సోదరుడు, రాజ్యసభ రేసులో ఉన్న ఓ నాయకుడు, హైదరాబాద్‌కు చెందిన ఓ రియల్ వ్యాపారి తదితరులు కలిసి తీరం వెంట ఆక్రమణకు అనువైన ప్రాంతాన్ని గుర్తించినట్లు విశ్వసనీయ సమాచారం. అందులో భాగంగా భారీ స్థాయిలో లావాదేవీలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో కబ్జాలకు తెరదించేందుకు కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రజలు అంటున్నారు.
తీరంలో ఆక్రమణలు సాగేది ఇలా...
కలెక్టర్ దృష్టి సారిస్తే కబ్జాలకు కళ్లెం...
తీరప్రాంతంలో జరుగుతున్న కబ్జాలపై కలెక్టర్ వి.వినోద్‌కుమార్ దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. అప్పుడే కబ్జాలకు కళ్లెం పడుతుందని భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి నుంచి నెలకొన్న లోపాలను ప్రక్షాళన చేయాలి. పారదర్శకంగా చర్యలు చేపట్టాలి. అప్పుడే కోట్ల రూపాయల విలువచేసే ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా ఉంటుంది. తద్వారా తీరప్రాంత అభివృద్ధి సక్రమంగా సాగుతుందని ప్రజలు సూచిస్తున్నారు.
7
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల


