గోవుల అక్రమ రవాణా అడ్డగింత | - | Sakshi
Sakshi News home page

గోవుల అక్రమ రవాణా అడ్డగింత

Mar 3 2026 8:09 AM | Updated on Mar 3 2026 8:09 AM

గోవుల అక్రమ రవాణా అడ్డగింత 8న ఉమెన్‌ పికిల్‌ బాల్‌ పోటీలు ఉత్తమ మహిళా పురస్కార గ్రహీత మంజు సెబాస్టియన్‌ వైభవంగా స్వామి వారి రథోత్సవం సమస్యలను సత్వరమే పరిష్కరించాలి

యడ్లపాడు: జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న గోవులను బీజేపీ నాయకులు సోమవారం అడ్డుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి అనుమతులు లేకుండా వాహనాల్లో తరలిస్తున్న ఆవులను గుర్తించి పోలీసులకు అప్పగించారు. తుని నుంచి ఎ. ప్రతాపరెడ్డి, హెచ్‌ నాగేంద్ర అనే వ్యక్తులు మినీ లారీల్లో ఆవులను లోడ్‌ చేసుకుని వెళ్తున్నారనే సమాచారం అందుకున్న బీజేపీ నాయకులు, స్థానిక ఎరక్రొండ వద్ద జాతీయ రహదారిపై ఆ వాహనాలను నిలిపివేసి తనిఖీ చేశారు. గోవుల తరలింపుపై వాహన చోదకులను ఆరా తీయగా, వారు ఎటువంటి అధికారిక అనుమతి పత్రాలను చూపలేకపోయారు. వాహనాలను స్థానిక పోలీస్‌ స్టేషన్‌న్‌కు తరలించారు. ఈ మేరకు అక్రమ రవాణాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు, యడ్లపాడు మండల అధ్యక్షుడు తులాబందుల సత్యనారాయణ నేతృత్వం వహించగా, వంకాయలపాటి వంశీధర్‌, వి. నాగేశ్వరరావు, పి. మహేష్‌, బందెల శ్రీనివాసరావు, నక్క శ్రీనివాసరావు, నేలటూరి ఏసురత్నం, షేక్‌ సుభాని, తోట చందు, శ్రీరామ్‌ చంద్ర తదితరులు పాల్గొన్నారు. బీజేపీ నాయకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, వాహన యజమానులు మరియు డ్రైవర్లపై విచారణ చేపట్టారు.

గుంటూరు వెస్ట్‌(క్రీడలు): పికిల్‌ బాల్‌ అసోసియేషన్‌ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీన గోరంటల్లోని నెక్ట్స్‌ జెన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో గుంటూరు ఓపెన్‌ ఉమెన్‌ పికిల్‌ బాల్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు నిర్వహిస్తామని జిల్లా పికిల్‌ బాల్‌ సంఘం సంయుక్త కార్యదర్శి కె.అరుణ్‌ కుమార్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీలకు సంబంధించిన పోస్టర్‌ను స్కూల్‌ ఆవరణలో వైజయంతి డెంటల్‌ కేర్‌ అధినేత డాక్టర్‌ వైజయంతి, శశిధర్‌, నెక్ట్స్‌ జెన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ అధినేత కె.శ్రీకాంత్‌ బాబు, కె.శ్రీవిద్య, జిల్లా పికిల్‌ బాల్‌ సంఘం కార్యదర్శి జీవీఎస్‌ ప్రసాద్‌లు ఆవిష్కరించారన్నారు. మార్చి ఎనిమిదో తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించి ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో అండర్‌–15 బాలికలు, ఓపెన్‌ కేటగిరి, సింగిల్స్‌, ఓపెన్‌ డబుల్‌ ఈవెంట్లు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో ఎస్‌కే మన్సూర్‌ వలి, ఆనంద్‌ కుమార్‌, స్కూల్‌ ఫిజికల్‌ డైరెక్టర్‌ జి.జె.కిషోర్‌ తదితరులు పాల్గొన్నారన్నారు.

గుంటూరు ఎడ్యుకేషన్‌: వైజాగ్‌లో ఆదివారం జరిగిన ఏపీ ప్రైవేటు స్కూల్స్‌ అసోసియేషన్‌ రాష్ట్రస్థాయి సమావేశంలో భాగంగా గుంటూరుకు చెందిన మాంటిస్సోరి ఇంగ్లిషు మీడియం పాఠశాల కరస్పాండెంట్‌ మంజు సెబాస్టియన్‌కు రాష్ట్రస్థాయిలో ఉత్తమ మహిళా పురస్కారాన్ని ప్రదానం చేసినట్లు పాఠశాల ప్రిన్సిపాల్‌ కేవీ సెబాస్టియన్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా వైజాగ్‌ పోక్సో కోర్టు న్యాయమూర్తి టి.మంగాకుమారి, వైజాగ్‌ ఆర్జేడీ విజయకుమార్‌ సమక్షంలో మంజు సెబాస్టియన్‌ను పురస్కారంతో సత్కరించినట్లు తెలిపారు.

నగరంపాలెం (గుంటూరు వెస్ట్‌): స్థానిక బృందావన్‌గార్డెన్‌న్స్‌లోని పద్మావతి గోదా సమేత వేంకటేశ్వరస్వామివారి 27వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం నిత్యపూజలు, వేంకటేశ్వర సహస్రనామ హోమం నిర్వహించారు. భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్‌ అధ్యక్షులు బొల్లేపల్లి సత్యనారాయణ, లలితాంబ దంపతుల ఆధ్వర్యంలో తిరుప్పావై అమృతవర్షిణి డాక్టర్‌ కోగంటి వెంకట రంగనాయకి గోష్టి బృందం చేపట్టారు. సుమారు 400 మందికిపైగా సువాసినులతో విష్ణుసహస్ర నామపారాయణం, లలితా సహస్ర నామ పారాయణం, లక్ష్మీ అష్టతోత్తర పారాయణం చేయించి పుష్పాలతో సత్కరించారు. భక్తులకు అన్నసంతర్పణ చేయగా, సువాసినులకు చీరల పంపిణి చేశారు. శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి వార్ల రథోత్సవం వైభవంగా చేపట్టారు. ఆధ్యాత్మిక సభలో భాగంగా విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు (హంపి) విద్యారణ్య భారతిస్వామి, శృంగేరి విరూపాక్ష పీఠం నుంచి పరమశివానంద భారతీస్వామి, మాత శివచైతన్యానంద స్వామి (తపోవనం నులకపేట) నిర్వికల్పానందస్వామిలు అనుగ్రహభాషణం చేశారు. ప్రముఖ సాహితీవేత్త డాక్టర్‌ డి.ఎన్‌.దీక్షితులు, ముప్పవరపు సింహాచలశాస్త్రి ఉపన్యాసించారు. కార్యక్రమంలో భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ, మాజీమంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ డాక్టర్‌ కె.జి.శంకర్‌, పూర్వ ఆచార్యులు డాక్టర్‌ ఆరేటి కృష్ణకుమారి, సీఐడీ డీఎస్పీ గోలి లక్ష్మయ్య, ఆలయ కమిటీ అధ్యక్షులు సీహెచ్‌.మస్తానయ్య, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, ఉపాధ్యక్షులు లంక విజయబాబు, సూర్యదేవర వెంకటేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, కన్నెగంటి బుచ్చయ్యచౌదరి, పుట్టగుంట ప్రభాకరరావు పాల్గొన్నారు.

ఎస్పీ బి. ఉమామహేశ్వర్‌

బాపట్ల టౌన్‌: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చే బాధితుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఎస్పీ బి. ఉమామహేశ్వర్‌ తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 37 మంది అర్జీదారులు ఎస్పీ కార్యాలయానికి చేరుకొని తమ సమస్యలను వివరించారు. బాధితుల సమస్యలు తెలుసుకున్న ఎస్పీ వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం జిల్లాలోని పోలీస్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అర్జీదారుల సమస్యలను చట్ట పరిధిలో విచారించి నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement