రేషన్‌ బియ్యం పట్టివేత | - | Sakshi
Sakshi News home page

రేషన్‌ బియ్యం పట్టివేత

Mar 3 2026 8:09 AM | Updated on Mar 3 2026 8:09 AM

రేషన్‌ బియ్యం పట్టివేత గుంటూరు రూరల్‌: గుంటూరు విజిలెన్స్‌ –ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందం, గుంటూరు తూర్పు మండల పౌరసరఫరాల అధికారుల సమన్వయంతో సోమవారం నగర శివారుల్లోని ఏటుకూరు బైపాస్‌ జంక్షన్‌ (అండర్‌పాస్‌) వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో అక్రమంగా తరలిస్తున్న ప్రజా పంపిణీ రేషను బియ్యం 28 బస్తాలు, బస్తా ఒక్కోటి 50 కేజీల చొప్పున 14 క్వింటాళ్ల లారీతో సహా స్వాధీనం చేసుకున్నారు. లారీ యజమాని, డ్రైవర్‌, రేషన్‌ బియ్యం అక్రమ వ్యాపారం చేస్తున్న శ్రీను, యాతం సతీష్‌ అనే వ్యక్తులపై నల్లపాడు స్టేషన్‌ నందు క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. దాడుల్లో పట్టుకున్న రేషన్‌ బియ్యం పై విచారణ చేసేందుకు గుంటూరు ఈస్ట్‌ సీఎస్‌ డీటీ బి.భాస్కరరావును విజిలెన్స్‌ ఎన్ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఆదేశించారు. కార్యక్రమంలో విజిలెన్స్‌ ఇన్స్‌స్పెక్టర్‌ కె.చంద్ర శేఖర్‌, కె.అమీర్‌, సబ్‌ ఇన్స్‌పెక్టర్స్‌, విజిలెన్‌న్స్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అప్పుల బాధలు తాళలేక ఫొటోగ్రాఫర్‌ ఆత్మహత్య

సత్తెనపల్లి: అప్పుల బాధలు తాళలేక ఫొటోగ్రాఫర్‌ ఆత్మహత్య చేసుకుని చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కట్టమూరు గ్రామంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. సత్తెనపల్లి మండలం కట్టమూరు గ్రామానికి చెందిన మల్లెల రాజు (37) ఫొటోగ్రాఫర్‌గా పని చేస్తూ జీవనం వెళ్లదీస్తున్నాడు. రాజుకు భార్య శ్రీనిధి, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తెకు ఫిట్స్‌ వస్తుండటంతో గత రెండు సంవత్సరాలుగా నెలకు రూ. 5 వేల వరకు ఖర్చు చేస్తున్నాడు. అంతేకాక కుమారుడికి కూడా నిత్యం జ్వరం వస్తుండడంతో కొంత అప్పులు అయ్యాయి. వీటికి తోడు బ్యాంకులో గృహ నిర్మాణ లోన్‌ రూ. 10 లక్షలు తీసుకోవడంతో ప్రతి నెల ఈఎంఐ చెల్లించాల్సి ఉంది. ఈక్రమంలో రెండు ఈఎంఐలు పెండింగ్‌లో ఉండడంతో ఈ అప్పుల నుంచి బయటపడేందుకు ఆత్మహత్య శరణ్యమంటూ భావించాడు. గత నెల 27న ఊరి చివర పురుగుల మందు సేవించి ఇంటికి వచ్చాక వాంతులు చేసుకోవడంతో భార్య ప్రశ్నించింది. దీంతో అప్పులు ఎలా తీరుతాయో తెలియటం లేదని, దీనికి తోడు కుమార్తె, కుమారుడు అనారోగ్యం అర్ధంకాక గడ్డి మందు సేవించానని భార్య శ్రీనిధికి చెప్పి విలపించాడు. ఆమె హుటాహుటిన చికిత్స నిమిత్తం సత్తెనపల్లి తరలించగా ప్రాథమిక చికిత్స అనంతరం గుంటూరు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. దీనిపై మృతుడి భార్య శ్రీనిధి ఫిర్యాదు మేరకు సత్తెనపల్లి రూరల్‌ పోలీసులు సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement