కారుకు నిప్పు పెట్టిన దుండగులు
దుగ్గిరాల: శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దుగ్గిరాలకు చెందిన దార్ల రవి కారు ను ఇంటి ముందు పార్క్ చేసి ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి ఒంటి గంట దాటిన తరువాత పెద్ద శబ్దం రావటంతో బయటకు వచ్చి చూడగా మంటలలో కాలుతున్న కారును గమనించిన స్థానికులు నీరు పోసి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే వెనుక వైపు పూర్తిగా కాలిపోయింది. గుంటూరు నుంచి క్లూస్ టీం వచ్చి ఉన్న ఆధారాలు సేకరించింది. కేసు నమోదు చేసి ఎస్‌ఐ వెంకట రవి దర్యాప్తు చేస్తున్నారు.
రైలు ఢీకొని వ్యక్తి దుర్మరణం
తెనాలిరూరల్: పిల్లలకు టిఫిన్ తీసుకువద్దామని వెళ్లిన తండ్రి రైలుఢీకొని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన తెనాలిలో ఆదివారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. పట్టణ పినపాడుకు చెందిన కరేటి సురేష్(50) కలప వ్యాపారం చేసేవాడు. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆదివారం కావడంతో పిల్లలకు టిఫిన్ తీసుకువచ్చేందుకు ఇంటి నుంచి వెళ్లాడు. పినపాడు సమీపంలోని మద్రాసు గేటు వేసి ఉండడంతో పట్టాలు దాటేందుకు ప్రయత్నించాడు. ఇటీవల నిర్మించిన నూతన రైలు మార్గం(మూడో లైను)లో ఓ రైలు వెళుతుండడంతో మరో పట్టాల వద్ద నిలచి ఉన్నాడు. ఆ పట్టాలపై మరో రైలు వచ్చి ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనాస్థలాన్ని ఇన్‌చార్జి జీఆర్పీ ఎస్‌ఐ ఎల్.సరస్వతి పరిశీలించారు. మృతదేహాన్ని జిల్లా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ముప్పాళ్ల: మద్యం మత్తులో యువకుడిపై కత్తితో దాడికి దిగిన సంఘటన ముప్పాళ్ల పెదనందిపాడు బ్రాంచి కాలువ పక్కనే ఉన్న వైన్‌షాపులో శనివారం రాత్రి జరిగింది. సంఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ముప్పాళ్లకు చెందిన జానకిరెడ్డి కొంత కాలంగా కాల్వ వద్ద నున్న వైన్‌షాపు వద్ద ఫుడ్‌కోర్టు నిర్వహిస్తున్నాడు. లంకెలకూరపాడు గ్రామానికి చెందిన యువకుడు, నరసరావుపేట మండలంలోని సాతులూరు కు చెందిన మరో యువకుడు దుకాణానికి వచ్చి ఫుడ్‌కోర్టు నిర్వాహకుడైన జానకిరెడ్డితో ఘర్షణ పడ్డారు. అనంతరం వారి వద్ద నున్న కత్తితో జానకిరెడ్డిపై దాడికి దిగారు. దాడిలో జానకిరెడ్డి తలపైన, కాలిపైన తీవ్ర గాయమైంది. ఘర్షణను అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో యువకుడి చేతిపైన కత్తి గాయమైంది. గాయపడిన యువకుడ్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన వారిపై గతంలోను అనేక కేసులు ఉన్నట్లు సమాచారం.
కారుకు నిప్పు పెట్టిన దుండగులు
కారుకు నిప్పు పెట్టిన దుండగులు
కారుకు నిప్పు పెట్టిన దుండగులు


