బాపట్ల | - | Sakshi
Sakshi News home page

బాపట్ల

Mar 3 2026 8:08 AM | Updated on Mar 3 2026 8:08 AM

మంగళవారం శ్రీ 3 శ్రీ మార్చి శ్రీ 2026 నేత్రపర్వం.. మల్లేశ్వరుని రథోత్సవం ట్యాబ్‌లు పంపిణీ బడుల్లో డీఈవో పరిశీలన ఇఫ్తార్‌ సహరి (మంగళ) (బుధ) బాపట్ల 6.21 5.08 నరసరావుపేట 6.23 5.10 గుంటూరు 6.21 5.08

భట్టిప్రోలు పురవీధులలో ఊరేగిన

బ్రహ్మోత్సవాలలో ముగిసిన కీలక ఘట్టం

న్యూస్‌రీల్‌

మంగళవారం శ్రీ 3 శ్రీ మార్చి శ్రీ 2026
నేత్రపర్వం.. మల్లేశ్వరుని రథోత్సవం

నరసరావుపేట: జిల్లాలో యూపీఎస్‌సీ పరీక్షలకు సిద్ధమవుతున్న నలుగురు ఎస్సీ విద్యార్థులకు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా సోమవారం ట్యాబ్‌లు పంపిణీ చేశారు.

మంగళగిరి టౌన్‌: స్థానికం పలు బడులను డీఈవో డాక్టర్‌ షేక్‌ సలీం బాషా సోమవారం సందర్శించారు. వీవర్స్‌ కాలనీ ప్రైమరీ హెల్త్‌ స్కూల్‌లో విద్యార్థులతో మాట్లాడారు.

భట్టిప్రోలు: హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు తన్మయత్వంతో శివనామస్మరణ చేస్తుంటే భట్టిప్రోలులో సోమవారం భ్రమరాంబ మల్లేశ్వరస్వామి రథం ముందుకు కదిలింది. తండోప తండాలుగా తరలి వచ్చిన వేలాది మంది భక్తులు స్వామివారి రఽథాన్ని ఉత్సాహంగా లాగుతుంటే భక్తులు మిద్దెలు, గోడలు ఎక్కి ఆ సుందర దృశ్యాన్ని తిలకించేందుకు ఆరాట పడ్డారు. పురవీధులన్నీ జనంతో నిండిపోయాయి.

స్వామివారి బ్రహ్మోత్సవాలలో కీలక ఘట్టమైన రథోత్సవం సోమవారం నేత్ర పర్వంగా కొనసాగింది. రథోత్సవానికి ముందు ఆలయ ప్రధాన అర్చకులు దండిభొట్ల రాజేంద్ర ప్రసాద్‌, యాజ్ఞీకులు కౌతా సత్య వెంకట నాగరాజేష్‌ శర్మ రథాంగ హోమం నిర్వహించారు. పూజా కార్యక్రమంలో దండిభొట్ల ఛాయనాథ సాయి ఆధ్వర్యంలో జొన్నాదుల వెంకట వరప్రసాద్‌–పద్మజ దంపతులు పాల్గొన్నారు. రథం దేవాలయం వద్ద నుంచి బయలు దేరి పురవీధుల గుండా స్వామి వారి అత్తారిల్లు అయిన అద్దేపల్లి అమ్మవారి చెట్టు వద్ద కు వెళ్లి తిరిగి ఆలయానికి చేరుకుంది. రథాన్ని లాగటం పుణ్యంగా భావించడంతో భక్త జన సందోహం పోటీ పడ్డారు. రథంపై పూలతో అలంకరించిన స్వామి వారిని చూసి భక్తులు పులకించి పోయారు. ఈ రథోత్సవాన్ని తిలకించేందుకు పరిసర ప్రాంతాల నుంచే కాక కష్ణాజిల్లా నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు.

కార్యక్రమాలను వంశపారంపర్య ధర్మకర్తలు, అద్దేపల్లి–భట్టిప్రోలు పద్మశాలీయ బహుత్తమ సంఘీయులు, దేవదాయ శాఖ మేనేజర్‌ ఎం. శ్రీనివాసరావు జెడ్పీటీసీ సభ్యురాలు తిరువీధుల ఉదయభాస్కరి పర్యవేక్షించారు. నిర్వాహకులు విశ్రాంత ఉపాధ్యాయులు బొలిశెట్టి శ్రీనివాసరావు పర్యవేక్షణలో అమ్మవారి చెట్టు వద్ద అన్న ప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో పీఎస్సార్‌ ప్రసాద్‌, ఎస్‌బీఐ విశ్రాంత ఉద్యోగి చీదెళ్ల ఉమామహేశ్వరరావు, మాస్టర్‌ జిలానీ తదితరులు పాల్గొన్నారు. రథోత్సవంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తిరునాళ్ల సందర్భంగా వైద్య ఆరోగ్య సిబ్బంది శిబిరం ఏర్పాటు చేశారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వేమూరు సీఐ పి.వీరాంజనేయులు పర్యవేక్షణలో భట్టిప్రోలు, నగరం ఎస్‌ఐలు శివయ్య, భార్గవ్‌ల ఆధ్వర్యంలో స్పెషల్‌ పార్టీ సిబ్బంది 46 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

7

భ్రమరాంబ మల్లేశ్వరస్వామి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement