ఫిమేల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ఏఓగా రామకృష్ణ | - | Sakshi
Sakshi News home page

ఫిమేల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ఏఓగా రామకృష్ణ

Feb 27 2026 7:32 AM | Updated on Feb 27 2026 7:32 AM

ఫిమేల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ఏఓగా రామకృష్ణ

ఫిమేల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ఏఓగా రామకృష్ణ

గుంటూరు మెడికల్‌: గుంటూరు ఆర్టీసీ బస్టాండ్‌ వెనుక ఉన్న ప్రాంతీయ శిక్షణ కేంద్రం (ఫిమేల్‌) పరిపాలనా అధికారిగా సూరె రామకృష్ణ గురువారం విధుల్లో చేరారు. నూతనంగా ఏఓగా విధుల్లో చేరిన రామకృష్ణను గుంటూరు జీజీహెచ్‌ మినిస్టీరియల్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కోటేశ్వరరావు, సభ్యులు టి.శ్రీనివాసరావు, తిరుపతిరావు, సీనియర్‌ అసిస్టెంట్‌ సురేష్‌, మనోజ్‌, రఫిక్‌, తదితరులు బొకే అందజేసి శాలువా కప్పి అభినందనలు తెలిపారు. గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు (ఆర్డీ) కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న రామకృష్ణకు ఈనెల 13న పరిపాలనా అధికారిగా పదోన్నతి లభించింది. ఫిమేల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ విజయలక్ష్మిని కలిసి రామకృష్ణ జాయినింగ్‌ రిపోర్ట్‌ అందజేశారు. నూతనంగా ఏఓగా విధుల్లో చేరిన రామకృష్ణకు శిక్షణా కేంద్రం సిబ్బంది అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement