అంగన్‌వాడీల వినూత్న నిరసన
● అంగన్‌వాడీలకు సమాన పనికి సమానవేతనం అమలు చేయాలన్నారు. రోజురోజుకు పెరుగుతున్న పనిభారంతో మానసిక ఒత్తిడికి గురవుతున్న పరిస్థితులు ఉన్నాయన్నారు.
● రూ.26వేల కనీస వేతనం అమలు చేయటంతో పాటు సంక్షేమ పథకాలు సైతం వర్తింపజేయాలన్నారు. ప్రస్తుత బడ్జెట్‌లో తమ వేతనాలపై మాట్లాడకపోవటం సిగ్గుచేటన్నారు. మోసపూరిత వాగ్దానాలతో అంగన్‌వాడీలను మభ్యపెడితే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
● ఏఐటీయుసీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సింగం వాణిశ్రీ మాట్లాడుతూ మహిళా పక్షపాతినని చెప్పుకుని గద్దెనెక్కిన సర్కార్ నేడు మహిళలను రోడ్డుపైకి తీసుకురావటం దుర్మార్గమైన చర్యన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలన్నారు.
● ఈ సందర్భంగా అంగన్‌వాడీలు మోకాళ్ళపై నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
● సీఐటీయు బాపట్ల జిల్లా కోశాధికారి సిహెచ్.మణిలాల్, ఏఐటీయుసీ నాయకులు పి.బిక్షాలు, ఐద్వా నాయకులు సుదీప్తి, ధనమ్మ, అహల్యలు అంగన్‌వాడీలకు మద్దతు తెలిపారు.
రేపల్లె: అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సీఐటీయు బాపట్ల జిల్లా అధ్యక్షురాలు కె.ఝాన్సీ హెచ్చరించారు. సమస్యల సాధనకై పట్టణంలోని అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయు), అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ (ఏఐటీయుసీ) సంఘాల పిలుపు మేరకు ఐసీడీఎస్ కార్యాలయ ఆవరణంలో ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్‌వాడీ కార్యకర్తలు మంగళవారం నిర్వహించిన రిలేనిరాహారదీక్షా శిబిరంలో ఆమె పాల్గొని మాట్లాడారు.
కార్యక్రమంలో సీఐటీయు, ఏఐటీయుసీ అనుబంధ సంఘాల అంగన్‌వాడీ వర్కర్స్ నాయకులు ఎస్.నిర్మల జ్యోతి, ఎన్.కృష్ణకుమారి, డి.జ్యోతి, సువర్ణ తదితరులు పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించకుంటే
ఉద్యమాలు తప్పవు