పోలీసుల సహకారంతోనే అంబటి ఇంటిపై దాడి | - | Sakshi
Sakshi News home page

పోలీసుల సహకారంతోనే అంబటి ఇంటిపై దాడి

Mar 4 2026 7:38 AM | Updated on Mar 4 2026 7:38 AM

నగరంపాలెం(గుంటూరు వెస్ట్‌): పోలీసుల సహకారంతోనే మాజీ మంత్రి అంబటి రాంబాబు కార్యాలయం, ఇంటిపై దాడి జరిగిందని మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. గుంటూరు సిద్ధార్థనగర్‌లోని మాజీ మంత్రి అంబటి రాంబాబుని మంగళవారం సాయంత్రం శ్రీకాంత్‌రెడ్డి పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాంబాబు నోటి వెంట అనుకోని మాట ఒకటి వచ్చిందని, తప్పుగా వచ్చిన పదాన్ని ఆసరా చేసుకుని దాదాపు ఏడెనిమిది గంటలకుపైగా విధ్వంసకాండ జరపడం దారుణమని అన్నారు. పొరపాటున నోరు జారిన మాటకు వెంటనే క్షమాపణ చెప్పారని తెలిపారు. అయినప్పటికీ అప్పటికప్పుడే ఫోన్‌ కాల్స్‌ చేసుకుని, విడతల వారీగా వచ్చేసి దాడి చేయడం ప్రజాస్వామ్య దేశంలో ఎప్పుడైనా చూశామా అని ప్రశ్నించారు. ఇంట్లోని మహిళలు, చిన్నారులను చూడకుండా ఇల్లు, కార్యాలయాన్ని ధ్వంసం చేయడం బాధాకరమని అన్నారు. దీనిని పోలీసులు నిలువరించకపోవడం దారుణమని అన్నారు. పోలీస్‌ వ్యవస్థ దాడులకు తెగబడిన వారిని ప్రోత్సహించడం ఎక్కడా చూడలేదన్నారు. గుంటూరు –2 ఎమ్మెల్యే గళ్లా మాధవి, ఆమె భర్త స్వయంగా వచ్చి దాడుల్లో పాల్గొనడం దారుణమని మండిపడ్డారు. వారిపై ఎక్కడా కేసులు నమోదు చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరిఫాతిమా, రాష్ట్ర నాయకులు నిమ్మకాయల రాజనారాయణ పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement