మంచంపై ఉన్న వారిని పీజీఆర్‌ఎస్‌కు తీసుకురావొద్దు | - | Sakshi
Sakshi News home page

మంచంపై ఉన్న వారిని పీజీఆర్‌ఎస్‌కు తీసుకురావొద్దు

Mar 2 2026 7:44 AM | Updated on Mar 2 2026 7:44 AM

మంచంప

మంచంపై ఉన్న వారిని పీజీఆర్‌ఎస్‌కు తీసుకురావొద్దు

మంచంపై ఉన్న వారిని పీజీఆర్‌ఎస్‌కు తీసుకురావొద్దు 6 నుంచి విఘ్న విమోచక హనుమాన్‌ ప్రాణ ప్రతిష్ఠ వేడుకలు

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌ కుమార్‌

బాపట్ల: నడవలేని, మంచాలకు పరిమితం అయిన, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఎవ్వరూ పీజీఆర్‌ఎస్‌కు తీసుకురావద్దని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌ కుమార్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించే పీజీఆర్‌ఎస్‌లో ప్రజలు సమస్యలపై అర్జీలను ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు స్వీకరిస్తామని చెప్పారు. ఇక్కడికి రాలేని పరిస్థితిలో ఉన్నవారికి సమస్యలు ఉంటే వారి తరఫున వారు వచ్చి అర్జీలను అందించవచ్చని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనంపై వచ్చే వారు తప్పనిసరిగా హెల్మెట్‌ పెట్టుకోవాలన్నారు. రెవెన్యూ డివిజన్‌లో, మండల తహసీల్దారు కార్యాలయాలలో అర్జీలను స్వీకరిస్తామని తెలిపారు.

తాడేపల్లి రూరల్‌: తాడేపల్లి పట్టణం సీతానగరంలోని విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై ఈనెల 6 నుంచి 8వ తేదీ వరకు విఘ్న విమోచక హనుమాన్‌ ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. త్రిదండి చిన్నశ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌స్వామి స్వీయ పర్యవేక్షణలో ఈ మహోత్సవం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమాల్లో భాగంగా 5వ తేదీ సాయంత్రం విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, రక్షా బంధనం, అంకురారోపణ, 6వ తేదీ ఉదయం అరణిమథనం, అగ్నిప్రతిష్ఠ, మన్యుసూక్త హవనం, పంచగవ్య శుద్ధి, పూర్ణాహుతి ఉంటాయన్నారు.

మంచంపై ఉన్న వారిని పీజీఆర్‌ఎస్‌కు తీసుకురావొద్దు 1
1/1

మంచంపై ఉన్న వారిని పీజీఆర్‌ఎస్‌కు తీసుకురావొద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement