కొమ్మమూరు కాలువలో గుర్తు తెలియని మృతదేహం | - | Sakshi
Sakshi News home page

కొమ్మమూరు కాలువలో గుర్తు తెలియని మృతదేహం

Mar 1 2026 7:51 AM | Updated on Mar 1 2026 7:51 AM

కొమ్మమూరు కాలువలో గుర్తు తెలియని మృతదేహం

కొమ్మమూరు కాలువలో గుర్తు తెలియని మృతదేహం

కొమ్మమూరు కాలువలో గుర్తు తెలియని మృతదేహం నేటి నుంచి కార్మిక పథకాలు పునఃప్రారంభం రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి పరిశ్రమల స్థాపన వేగవంతం చేయండి

కారంచేడు: కొమ్మమూరు కాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కొట్టుకు వచ్చిందని ఎస్‌ఐ షేక్‌ ఖాదర్‌బాషా తెలిపారు. ఆయన అందించిన సమాచారం మేరకు.. శనివారం మండలంలోని కుంకలమర్రు వంతెన సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు వచ్చిన సమాచారంతో తమ సిబ్బందికి ఘటనా స్థలానికి చేరుకున్నామని, మృతదేహంను బయటకు తీయించారన్నారు. సుమారు 35 నుంచి 40 సంవత్సరాల పురుషుడు, మృతుడు చామానఛాయ కలిగి ఉన్నాడని, ఎరుపు–నలుపు ఉన్న గళ్ల చొక్కా, గోధుమ రంగు ప్యాంట్‌ ధరించి ఉన్నాడన్నారు. మృతదేహం ఉన్న తీరును బట్టి ఎగువ ప్రాంతమైన నరసాయిపాలెం లాకుల నుంచి దిగువకు నీటి ప్రవాహానికి కొట్టుకు వచ్చిందన్నారు. చనిపోయి నాలుగైదు రోజులు అయ్యింటుందన్నారు. ఈ ఆనవాళ్ళు కలిగిన వ్యక్తి సమాచారం తెలిసిన వారు వెంటనే ఇంకొల్లు సీఐ 91211 02147, కారంచేడు ఎస్‌ఐ 91211 02145 నంబర్లకు సంప్రదించాలని ఆయన కోరారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి పంపించామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంబించామని ఎస్‌ఐ పేర్కొన్నారు.

నెహ్రూనగర్‌: భవన నిర్మాణ కార్మికులకు ఆగిపోయిన సంక్షేమ పథకాలు మార్చి 1వ తేదీ నుంచి తిరిగి పునఃప్రారంభించేందుకు సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించారని కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్‌ ఎ.గాయత్రిదేవి శనివారం ఓ ప్రకటనలో తెలియజేశారు. వివాహ కానుక, ప్రసూతి సహాయం(కాన్పు), సహజ మరణం, అంత్యక్రియలకు సంబంధించిన నాలుగు పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని భవన నిర్మాణ కార్మికులు తప్పనిసరిగా కార్మిక భవన నిర్మాణ గుర్తింపు కార్డు కలిగి ఉండాలని, అల్రెడీ ఉన్న కార్డులను ఆప్‌డేట్‌ చేయించుకోవాలని సూచించారు.

తెనాలిరూరల్‌: రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన తెనాలి పినపాడు గేటు సమీపంలో శనివారం జరిగింది. సుమారు 55 ఏళ్ల వ్యక్తి పట్టాలు దాటుతుండగా హౌరా – బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న జీఆర్పీ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని తెనాలి వైద్యశాల మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా

నరసరావుపేట: జిల్లాలో పరిశ్రమలు స్థాపించేందుకు ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకున్న యజ మానులను సమాయత్తం చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా పరిశ్రమల శాఖ, ఏపీఐఐసీ, రెవెన్యూ, సంబంధిత అధి కారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 2025 భాగస్వామ్య సదస్సులో కృష్ణా ఆగ్రో ఫ్యూయల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, మైహోం సిమెంట్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌, ఇందన ఎనర్జీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వంటి భారీ, మెగా ప్రాజెక్టులు స్థాపించేందుకు ముందుకొచ్చాయన్నారు. యజమానులకు ఉన్న సమస్యల పరిష్కారానికి. అధికారులు వేగవంతంగా పనిచేయాలని సూచించారు.

నిబంధనల మేరకే పశు ఔషధి విక్రయ కేంద్రాలు

పశు ఔషధి విక్రయ కేంద్రాలను నిబంధనల ప్రకారం ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. శనివారం పశుసంవర్ధక శాఖపై వర్చువల్‌గా కలెక్టర్‌ జిల్లా పశు వైద్య శాఖ అధికారి, మండల వైద్య అధికారులతో సమీక్ష సమావేశం. శాఖకు చెందిన మండల పశు వైద్యాధికారులకు నిర్దేశించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement