భావదేవునికి సామూహిక హారతులు | - | Sakshi
Sakshi News home page

భావదేవునికి సామూహిక హారతులు

Mar 5 2026 7:33 AM | Updated on Mar 5 2026 7:33 AM

భావదేవునికి సామూహిక హారతులు

బాపట్ల: పౌర్ణమిని పురస్కరించుకొని బాపట్ల భావన్నారాయణ స్వామి దేవాలయంలో బుధవారం సమరసత సేవా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ‘సామూహిక దీపోత్సవ హారతి‘ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ధర్మ ప్రచారక్‌ జంజనం హేమశంకరరావు మాట్లాడుతూ సామూహిక హారతులు స్వామి వారికి ఇవ్వడం వల్ల మన దోషాలు తొలగి శుభాలు కలుగుతాయని తెలియజేశారు. స్వామి వారి ఆలయంలో దీపపూజ కార్యక్రమం, నగర సంకీర్తన కార్యక్రమం, సామూహిక హారతి నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ధర్మ విస్తారక్‌ మోదడుగు సూరిబాబు, మహిళా కన్వీనర్‌ కోట్రా పద్మ ,గౌరి, వేముల రోజారాణి, నాగవరపు వెంకటలక్ష్మి, లక్ష్మీ సుజాత, గృహలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement