స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)కు పశ్చిమ బెంగాల్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలు సర్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. బీజేపీ సర్ ప్రక్రియను ఉపయోగించి ఓటర్లను తొలగిస్తోందని తృణమూల్ ఆరోపిస్తోంది. మంగళవారం జరిగిన ఎస్ఐఆర్ వ్యతిరేక ర్యాలీలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో తనను చాలెంజ్ చేస్తే దేశంలో బీజేపీ పునాదులు కదిలిస్తానని మమత వ్యాఖ్యానించారు. బొంగావ్‌లో జరిగిన ఎస్ఐఆర్ వ్యతిరేక ర్యాలీలో మమతా బెనర్జీ ప్రసంగిస్తూ, రాష్ట్రంలోని మతువా-మెజారిటీ ప్రాంతాలలోని ఓటర్లు పౌరసత్వం (సవరణ) చట్టం ప్రకారం తమను తాము విదేశీయులుగా ప్రకటిస్తే వారిని "వెంటనే జాబితా నుండి తొలగిస్తారు" అని కూడా మమతా బెనర్జీ పేర్కొన్నారు. బీజేపీ రాజకీయంగా తనను ఓడించలేదని గతంలోనే పదిసార్లు చెప్పానని మమత మరోసారి నొక్కి వక్కాణించారు. అంతేకాదు ఎన్నికల కమిషన్ ఇకపై నిష్పాక్షిక సంస్థ కాదు, కానీ బిజెపి కమిషన్‌గా మారిపోయిందంటూ భారత ఎన్నికల సంఘం (ఇసిఐ)పై విమర్శలు గుప్పించారు.
చదవండి: స్మృతి పెళ్లికి బ్రేక్స్ : వైరల్ స్ర్కీన్ షాట్స్, ఎవరీ మేరీ డికోస్టా
“అక్రమ బంగ్లాదేశీయులను” తొలగించడమే లక్ష్యమైతే, బిజెపి పాలిత రాష్ట్రాల్లో SIR ఎందుకు నిర్వహిస్తు న్నారని మమత ప్రశ్నించారు. అంటే పార్టీ “డబుల్ ఇంజిన్ పాలిత రాష్ట్రాల్లో కూడా చొరబాటుదారులు ఉన్నారని అంగీకరిస్తుందా అని ఆమె ఎద్దేవా చేశారు. తానుఒక దేశంగా బంగ్లాదేశ్‌ను ప్రేమిస్తున్నాననీ తమ భాషా ఒకటేనని చెప్పారు. ఏదో ఒకరోజు తనను కూడా బంగ్లాదేశీ అని పిలుస్తారని విమర్శించారు. ఈ రాష్ట్రం నుంచి ఈ జాబితా ప్రకారమే 2024లో ప్రధాని మోదీ ఓట్లు గెల్చుకున్నారు. మరి ఆ ఓట్లు తీసేస్తే కేంద్ర ప్రభుత్వం కూడా తొలగించాలా కదా అన్నారు. అసలు సర్ నిర్వహణకు ఎందుకు ఇంత తొందర పడుతున్నారని సీఎం మమత ప్రశ్నించారు.
ఇదీ చదవండి: వామ్మో..తృటిలో తప్పించుకున్నాడు, లేదంటే!
"నేను ఇక్కడ ఉన్నంత వరకు, వారు మిమ్మల్ని వెళ్లగొట్టడానికి నేను అనుమతించను. ఎవరూ మిమ్మల్ని వెళ్లగొట్టలేరు’’ అంటూ రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చారు. ఇక్కడ బంగ్లాదేశీయులే సమస్య అయితే, మధ్యప్రదేశ్ , యుపీలోSIR ఎందుకు నిర్వహిస్తున్నారు? అని మమతా అటు ఈసీపైనా, ఇటు బీజేపీపైనా నిప్పులు చెరిగారు.
కాగా ఇటీవలి బిహార్ ఎన్నికల్లో ఎన్టీయే కూటమి ఘన విజయం తరువాత బిహార్ గెలిచేశాం. ఇక పశ్చిమ బెంగాల్ వంతు అని బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలకే కౌంటర్‌గానే మమతీ ప్రతిసవాల్ చేసినట్టుగా భావిస్తున్నారు.


