రాజస్థాన్‌లో దారుణం జరిగింది. పుల్‌గా తప్ప తాగిన ఓ వ్యక్తి కారుపై అదుపు కోల్పోయి రోడ్డుపై విచక్షణ రహితంగా కారు నడిపాడు. అతివేగంతో డ్రైవ్ చేస్తూ రోడ్డుపై నడుస్తున్న పాదచారులను ఢీకొట్టి బీభత్సం సృష్టించాడు. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు వదలగా 15 మంది గాయపడ్డారు.
మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిగే ప్రమాదాలపై ప్రభుత్వాలు ఎన్ని అవగాహనా కార్యక్రమాలు నిర్వహించినా పెద్దగా ఫలితం ఉండట్లేదు. తాజాగా రాజస్థాన్ జైపూర్‌లో ఫుల్‌గా తప్పతాగిన ఓబ్యాచ్ ఓవర్ స్పీడ్‌తో కారు నడిపారు. వాహనం కంట్రోల్ తప్పి రోడ్డుపై బీభత్సం సృష్టించారు. పోలీసుల వివరాల ప్రకారం.. మద్యం సేవించిన ఓ వ్యక్తి పుల్‌గా తాగి ఆడి కారు వేగంతో నడిపారు. అనంతరం అదుపు కోల్పోయి రోడ్డపై ఉన్న డివైడర్‌ను ఢీకొట్టాడు. ఆపై అక్కడే ఉన్న షాపులను గుద్దుకుంటూ పాదచారులపై కారు నడిపాడు. ఈ దుర్ఘటనలో రమేశ్ బైరవ అనే వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. 15 మంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ప్రమాద సమయంలో కారులో నలుగురు వ్యక్తులుండగా అందరూ మద్యం సేవించి ఉన్నారని పోలీసులు తెలిపారు. వారిలో ముగ్గురు ఘటనా స్థలం నుంచి పరారవ్వగా ఒకరిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ విచారం వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని అధికారులను ఆదేశించారు.


