breaking news
KV Satish
-
‘సరైన టైం చూసి కూటమి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారు’
సాక్షి,వైఎస్సార్: పులివెందుల నియోజకవర్గం మంగళవారం జన సంద్రంగా మారింది. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా వేలాది మంది అభిమానులు, స్థానిక ప్రజలు భారీగా తరలి వచ్చారు. భాకరపురంలోని తన క్యాంప్ ఆఫీస్‌లో వైఎస్ జగన్ నిర్వహించిన ప్రజాదర్బార్‌కు అన్ని వర్గాల ప్రజలు హాజరై తమ సమస్యలను వినిపించారు. వైఎస్ జగన్ పర్యటనకు ఇంత భారీ స్పందన రావడం పట్ల వైఎస్సార్సీపీ నేతలు సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలు కూటమి ప్రభుత్వం ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నారని, తగిన సమయంలో ప్రజలు తమ నిర్ణయం చెబుతారని పార్టీ నాయకులు వ్యాఖ్యానించారు.ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ..చంద్రబాబు ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు, రైతులు మోసపోయారని ఆయన అభిప్రాయపడ్డారు.అరటి రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతుల వద్ద టన్నుకు రూ.200 మాత్రమే ఇచ్చి కొనుగోలు చేసి.. అదే పంటను మార్కెట్లో మధ్యవర్తులు రూ40 నుంచి రూ.50 కిలోకు అమ్ముతూ భారీ లాభాలు ఆర్జిస్తున్నారనిఅన్నారు.అరటి, చీనీ, మామిడి, టమోటా, పత్తి ఏ పంట తీసుకున్నా రైతులకు ఈ ప్రభుత్వంలో ప్రయోజనం కలగలేదని ఆయన విమర్శించారు. రైతుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. సూపర్ సిక్స్ హామీలో ప్రతి రైతుకు సంవత్సరానికి రూ.20,000 ఇస్తామని ప్రభుత్వం చెప్పినా, 18 నెలల్లో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు. ఇన్పుట్ సబ్సిడీ కూడా అందలేదని పేర్కొన్నారు. రైతులు తమ సమస్యలను అర్థం చేసుకుని, సరైన సమయంలో ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. -
కుటుంబ ప్రేక్షకులకు దగ్గరయ్యాను : కేవీ సతీశ్
‘‘సినిమాల్లో నటించాలనే నా చిన్నప్పటి కల ‘యమలీల-2’తో నెరవేరింది. కుటుంబ ప్రేక్షకులకు దగ్గర కావాలనే ఆశయంతో చేసిన చిత్రమిది. పెద్దవాళ్లు మాత్రమే కాదు.. ఐదేళ్ల పిల్లలు కూడా నన్ను గుర్తుపడుతున్నందుకు ఆనందంగా ఉంది. నేను ఫ్యామిలీ హీరో అనిపించుకోవడానికి కారణం ఈ చిత్రబృందం. నా తదుపరి చిత్రాలు కూడా కుటుంబ సమేతంగా చూడదగ్గవిగానే ఉంటాయి’’ అని డా. కేవీ సతీశ్ అన్నారు. ఆయన హీరోగా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘యమలీల 2’ గత వారం విడుదలైన విషయం తెలిసిందే. కె.అచ్చిరెడ్డి ఆశీస్సులతో డీయస్ మ్యాక్స్ సమర్పణలో క్రిష్వీ ఫిలింస్ పతాకంపై ఆశా సతీశ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం విజయోత్సవ సభలో ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ -‘‘మోహన్‌బాబు, బ్రహ్మానందంలాంటి సీనియర్స్ కాంబినేషన్లో ఓ కొత్త నటుడు నటించడం చిన్న విషయం కాదు. సెంటిమెంట్, యాక్షన్ సన్నివేశాల్లో సతీశ్ బాగా నటించారు. మాస్ హీరోలకు ఏమాత్రం తక్కువ కాకుండా ఫైట్స్ చేశారు. తదుపరి చిత్రం సతీశ్‌ని మరో మెట్టు ఎక్కేలా చేస్తుంది. అలాంటి సినిమా చేయబోతున్నాం’’ అన్నారు. అచ్చిరెడ్డి మాట్లాడుతూ -‘‘ప్రథమార్ధంలో కూల్‌గా, ద్వితీయార్ధంలో హీరోయిజమ్‌ని ఎలివేట్ చేసే పాత్రను సతీశ్ బాగా చేశారు. ఆయన మంచి వ్యక్తి కూడా. హుద్ హుద్ తుఫాను బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి సతీశ్ పది లక్షల రూపాయలు విరాళమందించారు’’ అన్నారు. వసూళ్లు బాగున్నాయనీ, 500 థియేటర్లలో 50 రోజులాడటం ఖాయమని సహ నిర్మాత డీకే అరుణ్ కుమార్, విజయ్‌భాస్కర్ చెప్పారు.


