విజయవాడ: ఏపీలోని రైతుల్ని దీనావస్థలోకి నెట్టేసిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బండారం బట్టబయలైంది. మంత్రి పార్థసారథి ఎపిసోడ్‌తో ప్రభుత్వం గుట్టురట్టయ్యింది. రైతులు దీనావస్థలో ఉన్నారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కొన్ని రోజుల క్రితం చెప్పింది.. ఇప్పుడు మంత్రి పార్థసారధి సాక్షిగా నిజమని తేలిపోయింది. అసల రైతుల పట్ల ప్రభుత్వ నిబంధనలు ఎంత దారుణంగా ఉన్నాయో సుస్పష్టమైంది.
ఈరోజు(శనివారం) మంత్రికి రైతుల నుంచి సెగ తగలడంతో రెచ్చిపోయారు. బూతులతో మరీ రెచ్చిపోయారు రైతుల కష్టాన్ని దళారులు దోచుకుంటున్నారని మంత్రికి రైతులు ఫిర్యాదు చేయగా, దాన్ని అధికారుల మీదకు, మిల్లర్ల మీదకు నెట్టేసే యత్నం చేశారు. మీరు మీర కలిసి దోచుకోండి అంటూ మండిపడ్డారు. ఫలితంగా మిల్లర్లకు లబ్ధి చేకూర్చడం కోసం ధాన్యం కొనుగోలు చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తున్న వైనం బయటపడింది.
రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని ఫిర్యాదు చేస్తే.. ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్యలు తీసుకుంటామో చెప్పకుండా ‘ మీరు మీరు’ దోచుకోండి’ అంటూ అధికారుల్ని, మిల్లర్లపై ధ్వజమెత్తారు మంత్రి. నాణ్యత ఉన్నప్పటికీ ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు ప్రభుత్వం. మంత్రి పార్థసారథి సొంతగ్రామంలో కూడా ధాన్యం కొనుగోలు చేయని దుస్థితి నెలకొంది. ధాన్యం కొనుగోలు చేయక కల్లాల్లోనూ , మిల్లుల వద్ద రైతుల పడిగాపులు కాస్తున్నారు. నాణ్యత ఉన్నప్పటికీ తేమ శాతం చూపించి మిట్లర్లు ధాన్యం కొనుగోలు చేయని క్రమంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ ఇవ్వకుండా ఇలా రెచ్చిపోతే రైతుకు న్యాయం ఎలా జరుగుతుందనేది రైతుల ప్రశ్న.


