
సాక్షి,జగిత్యాల : జగిత్యాల కోర్టు ఆదేశాలతో అధికారులు ఆర్డీవో కార్యాలయ సామాగ్రి జప్తు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు రైతులకు సరైన పరిహారం చెల్లించలేదని కారణంతో ఆర్డీవో కార్యాలయ సామాగ్రి జప్తు చేసినట్లు తెలుస్తోంది.
పెద్దపల్లి- నిజామాబాద్ రైల్వేలైన్ కోసం 2006లో రైతుల నుంచి సుమారు 100 ఎకరాలు భూమిని సేకరించారు. రైతులకు ఒక్క ఎకరాకు కేవలం రూ.లక్షా 30వేలు మాత్రమే అధికారులు చెల్లించారు. అయితే, అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు రైతులకు అండగా నిలిచింది. ఒక్కో ఎకరాకు రూ.లక్షా 30వేలు కాదని, 15లక్షల97 వేల200 చెల్లించాలని కోర్టు ఉత్తర్వులు
జారీ చేసింది.
కోర్టు ఉత్తర్వులు జారీ చేసినా రైతులకు పరిహారం చెల్లించే విషయంలో ఆర్డీఓ అధికారులు విఫలమయ్యారు. దీంతో ఆర్డీఓ అధికారులపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.ఆర్డీవో కార్యాలయ సామాగ్రి జప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో అధికారులు ఆర్డీవో కార్యాలయా సామాగ్రిని జప్తు చేశారు.