కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గం రామరాజుపాలెం ప్రాంతంలో మోంథా తుఫానుతో తీవ్రంగా నష్టపోయిన పంట పొలాలను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం(04-11-2025) పరిశీలించారు. వరి పొలాల్లో తుపాను ధాటికి తడిసిపోయిన వరి కంకులను రైతులు ప్రత్యక్షంగా చూపించారు..


