సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా మారిందని వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ విమర్శించారు. ఇటీవల వచ్చిన మోంథా తుపాను వల్ల భారీ నష్టం జరిగినా ప్రభుత్వం ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదని మండిపడ్డారు.
40 బస్తాల పంట 25 బస్తాలకు పడిపోయింది. రైతులు రోడ్డున పడ్డా పట్టించుకునే వారు లేరు. చంద్రబాబుకు రైతులపై చిన్నచూపు ఉందని అనిల్ కుమార్ అన్నారు.
ఇదిలా ఉంటే కౌలు రైతుల పరిస్థితి మరింత కష్టాల్లో ఉందని కోత వ్యయం రూ.15 వేల మేర పెరిగిందని చెప్పారు. ఆర్బీకేలు నిర్వీర్యం కావడంతో దళారీ వ్యవస్థ పెరిగిందని విమర్శించారు.
పంట నష్టం అంచనాల్లోనూ రైతులకు అన్యాయం జరిగింది. ప్రభుత్వం ఉచిత పంట బీమా అమలు చేయాలి. ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేయాలి. తేమ పేరుతో మిల్లులు చేసే మోసాలను అడ్డుకోవాలని కైలే అనిల్ డిమాండ్ చేశారు.


