సాక్షి, అనంతపురం: రాష్ట్రంలో గిట్టుబాటు ధరల్లేక రైతులు అల్లాడుతుంటే.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏం పట్టనట్లు వ్యవహరిస్తున్నారని శింగనమల వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతు వ్యతిరేకి. ఆయన ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతులకు కష్టాలు తప్పవు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడుతున్నారు. అయినా చంద్రబాబు సర్కార్ పట్టించుకోవడంలేదు.
అరటి, ఉల్లి, మొక్కజొన్న, ధాన్యం, కొబ్బరి... ఇలా ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. చంద్రబాబు ప్రతిరోజూ స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతున్నారు. అలాంటి వ్యక్తికి రైతుల కన్నీరు కనిపించడం లేదా?. అలాంటప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆయనేం చేస్తున్నట్లు అని శైలజానాథ్ అన్నారు.


