తాడేపల్లి : అమరావతిలో అన్యాయం, అవినీతి జరుగుతుంటే ప్రశ్నించడంలో తప్పేముందన్నారు వైఎస్సార్‌సీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. తన తందాన కంపెనీలకే బాబు కాంట్రాక్టులు కట్టబెడుతున్నారని, ఆ కంపెనీల నుంచి 4 శాతం కమీషన్లు బాబు తీసుకుంటున్నారని సజ్జల స్పష్టం చేశారు. ఈరోజు(శనివారం, జనవరి 10వ తేదీ) తాడేపల్లి నుంచి మీడియాతో మాట్లాడిన సజ్జల.. మొబలైజేషన్ అడ్వాన్స్‌లతో బాబు అండ్ కో దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు.
‘చంద్రబాబు అమరావతి మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్. అమరావతిలో నీళ్లు తోడటానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. వైఎస్ జగన్ ఇల్లు ఉన్న ఏరియా, అమరావతి ఒక్కటైనా.. అమరావతిలో నీళ్లు తోడటానికి వేల కోట్లు ఎందుకు ఖర్చు చేస్తున్నారు. అమరావతిలో చంద్రబాబు అక్రమ నివాసంలో ఉన్నారు.. ఇప్పుడు ఇల్లు కడుతున్నారు.
మేం అమరావతిని తక్కువ చేయలేదు
తాము ఎప్పుడూ అమరావతిని తక్కువ చేయలేదని, అమరావతి పేరుతో చంద్రబాబు చేస్తున్న స్కామ్‌లను ప్రశ్నిస్తున్నామన్నారు సజ్జల. ‘విశాఖలో సీఎం కూర్చుంటే మరింత అభివృద్ధి అని చెప్పాం. అమరావతిని వైఎస్సార్‌సీపీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తుంది. చంద్రబాబు బెదిరింపులు అరుపులు కాకుండా సూటిగా సమాధానం చెప్పాలి. గొంతెత్తి, కళ్లు పెద్దవి ేసి బెదిరిస్తే సమాధానం దొరకదు. రూ. లక్ష కోట్ల అప్పుకు ఏడాదికి రూ. 8 వేల కోట్ల వడ్డీ కట్టాలి
రాయలసీమ ప్రయోజనాలు ఎలా.?
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తెలంగాణ రోజుకు 8 టీఎంసీలు వాడుకుంటుంది. 777 అడుగుల నుంచే తెలంగాణ నీళ్లు తోడుకుంటుందే రాయలసీమ ప్రయోజనాలు ఎలా?, రాయలసీమ హక్కుల పరిరక్షణలో చంద్రబాబ విఫలమయ్యారు. ఆర్గనైజ్జ్ మీడియా టెర్రరిజంతో నిజాలను ప్రజల్లోకి వెళ్లకుండా చేస్తున్నారు. చంద్రబాబు సైలెంట్ ఉండటం అంటే రేవంత్ చెప్పింది నిజమే అని అర్థం చేసుకోవాలి
విష, అబద్ధపు ప్రచారంలో చంద్రబాబు పీహెచ్‌డీ
విష, అబద్ధపు ప్రచారంలో చంద్రబాబు పీహెచ్‌డీ చేశారని సజ్జల విమర్శించారు. పాస్ పుస్తకాలపై క్యూఆర్ కోడ్ అనేది వైఎస్ జగన్ ఉన్నప్పుడే ఉందని, ఇప్పుడు దాన్ని చంద్రబాబు తీసుకొచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళితే అందులో దాపరికం ఎందుకని ప్రశ్నించారు.
‘లక్షా 80 కేజీల గోమాంసం విశాఖలో పట్టుబడితే ఏం చేశారు. క్వశ్చన్ చేసే వారిపై అక్రమ కేసులు పెట్టి జైళ్లలో వేస్తున్నారు. మేం అడిగిన ప్రశ్నలకు బాబు సమాధానం ఇవ్వకుండా.. మమ్మల్ని ప్రశ్నలు అడుగుతాడు. అధికారం వచ్చాక కూడా వారంలో మూడు, నాలుగు రోజులే బాబు ఇక్కడ ఉంటున్నారు. ప్రతివారం హైదరాబాద్‌లో చంద్రబాబు, లోకేష్‌లకు ఏం పని? అని నిలదీశార సజ్జల.

చంద్రబాబు అరాచక పాలన నుంచి ఏపీని కాపాడుకుందాం
చంద్రబాబు అరాచక పాలన నుంచి ఏపీని కాపాడుకుందామన్నారు సజ్జల ‘ వైఎస్ జగన్ హయాంలో రూ. 3.30 లక్షల కోట్లు అప్పు చేశారు. రూ. 3.30 లక్షల కోట్లలో రూ. 2.73 లక్షల కోట్లు డీబీటీ ఇచ్చాం. చంద్రబాబు రెండేళ్లు తిరగకుండానే రూ. 3 లక్షల కోట్లపైగా అప్పు చేశారు. చంద్రబాబ పాలనను ప్రజలు, విజ్ఞులు మేధావులు ప్రశ్నించాలి’ అని విజ్ఞప్తి చేశారు.


