కనుమూరి హాస్పటల్‌లో ప్రపంచ స్థాయి వైద్య సేవలు | - | Sakshi
Sakshi News home page

కనుమూరి హాస్పటల్‌లో ప్రపంచ స్థాయి వైద్య సేవలు

Mar 7 2026 8:18 AM | Updated on Mar 7 2026 8:18 AM

కనుమూరి హాస్పటల్‌లో ప్రపంచ స్థాయి వైద్య సేవలు

గుంటూరు మెడికల్‌: మోకాలి నొప్పి, ఆస్టియో ఆర్థరైటీస్‌ వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి గుంటూరులోనే ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని ప్రముఖ ఆర్థోపెడిక్‌, జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌ శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్‌ గిరిధర్‌ బోయపాటి తెలిపారు. గుంటూరులోని ప్రముఖ వైద్య సంస్థ కనుమూరి హాస్పటల్‌లో డాక్టర్‌ గిరిధర్‌ బోయపాటి మాట్లాడుతూ మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలో ఇటీవల వచ్చిన సాంకేతిక అభివృద్ధి వైద్య రంగంలో కొత్త దశను ప్రారంభమాయ్యయన్నారు. అత్యాధునిక జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ 4వ జనరేషన్‌ వైలెస్‌ రోబోటిక్‌ క్ని రీప్లేస్‌మెంట్‌ సిస్టమ్‌ సహాయంతో రోబోటిక్‌ మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో నిర్వహించిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో పాల్గొని, రోబోటిక్‌ మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలలో నూతన సాంకేతికతలు, మెరుగైన శస్త్రచికిత్స పద్ధతులపై అధునాతన శిక్షణ పొందినట్లు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న రోబోటిక్‌ టెక్నాలజీ గుంటూరుకు తీసుకు రావడం మా లక్ష్యం అన్నారు. రోగులకు తక్కువ నొప్పితో, వేగంగా కోలుకునే అత్యుత్తమ చికిత్సను అందించడం కోసం కనుమూరి హాస్పటల్‌ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement