సాక్షి, గుంటూరు: రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీని సంస్థాగత నిర్మాణం చేయాలని వైఎస్ జగన్ ఆదేశించారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. రానున్న 45 రోజుల్లో సంస్థాగత నిర్మాణం పూర్తవుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబుకు సంస్థాగత నిర్మాణం బాధ్యతలు అప్పగించారన్నారు. వైఎస్ జగన్ ఎక్కడకు వెళ్లినా ప్రజలు లక్షలాది మంది వస్తున్నారని అంబటి అన్నారు.
సుధాకర్ బాబు మాట్లాడుతూ.. నేడు గుంటూరు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల సమావేశం జరిగిందని.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన మొదలు కొని పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం పని చేస్తున్నామన్నారు. గ్రామస్థాయిలోకి వెళ్లి వైఎస్సార్‌సీపీ పని చేస్తోందని.. ఒక మహాయజ్ఞంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. వైఎస్ జగన్ ఒక్కరితో ప్రారంభించిన పార్టీ వేలాదిగా, లక్షలాదిగా, కోట్లాదిగా మారింది’’ అని సుధాకర్‌బాబు పేర్కొన్నారు.
టీడీపీ, బీజేపీ, జనసేన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతుంది. వైఎస్సార్‌సీపీ పాలనలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాం. రాష్ట్రంలో ఎప్పుడూ ఎన్నికలు జరిగిన వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయం. రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన పాలన సాగుతోంది. సోషల్ మీడియాను బలోపేతం చేసి కూటమి ప్రభుత్వంపై అలుపు ఎరుగని పోరాటం చేస్తాం’’ అని సుధాకర్‌బాబు చెప్పారు.


