
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మేడారం మహాజాతర పర్యటన ఖరారైంది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి హెలీకాప్టర్‌లోబయలుదేరుతారు. 1.15 గంటలకు మేడారంకు చేరుకుంటారు. 1.25గంటల నుంచి 1.45గంటల వరకు జాతర ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విడిదిలో బస చేస్తారు. 1.45 గంటలకు సమ్మక్క సారలమ్మ గద్దెల వద్దకు వెళతారు. 1.50 గంటల నుంచి 2గంటల వరకు తల్లులకు ప్రత్యేక పూజలు చేస్తారు. తులాభారం తూగి నిలువెత్తు బెల్లాన్ని తల్లులకు కానుకగా ఇస్తారు. 3.10గంటలకు మేడారం నుంచి తిరుగుప్రయాణం అవుతారు. సీఎం రాక సందర్భంగా జాతర ప్రాంగణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.