మేడారంలో సీఎం రేవంత్‌రెడ్డి రెండో రోజు పర్యటించారు. మంగళవారం వేకువ జామునే కుటుంబ సమేతంగా సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్నారు.
తొలిమొక్కును రేవంత్ దంపతులు చెల్లించుకున్నారు. తన ఎత్తు బంగారాన్ని(బెల్లం) ఆయన సమర్పించారు. అంతకు ముందు.. ఆధునీకరించిన మేడారం గద్దెలను సీఎం ప్రారంభించారు.
సమ్మక్క–సారలమ్మ సన్నిధిలో నిర్మించిన నూతన సాలహారం, ద్వారాలు, ఆర్చీలను సీఎం రేవంత్‌రెడ్డి మంత్రులతో కలిసి సీఎం ప్రారంభించారు.


