21 రోజులు ‘మేడారం’ మూసివేత

Medaram Temple Closed For 21 Days As Employees Test Covid 19 Positive - Sakshi

ఎస్‌ఎస్‌ తాడ్వాయి: ములుగు జిల్లా ఎస్‌ఎస్‌ తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క– సారలమ్మ ఆలయాన్ని సోమవారం నుంచి 21 రోజుల పాటు మూసివేయనున్నారు. ఆదివారం ఇక్కడి ఎండోమెంట్‌
కార్యాలయంలో ఆలయ ఈఓ రాజేంద్రం, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు మీడియా సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. మేడారం మినీ జాతరలో విధులు నిర్వహించిన ఇద్దరు ఎండోమెంట్‌
ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌ రావడంతో విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.

ప్రజల  ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 21 రోజుల పాటు అమ్మవార్ల దర్శనం నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. కరోనా దృష్ట్యా భక్తులు మేడారానికి రావొద్దని కోరారు. బుధవారం తిరుగువారం పండుగ, పూజా కార్యక్రమాలను సమ్మక్క– సారలమ్మ పూజారులు అంతర్గతంగా నిర్వహించుకుంటారన్నారు. కాగా, ఆదివారం భారీగా తరలివచ్చిన భక్తులు అమ్మవార్లకు మొక్కు లు చెల్లించుకున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top