సాక్షి, ములుగు జిల్లా: మేడారంలో తెలంగాణ కేబినెట్ ప్రారంభమైంది. తొలిసారిగా సచివాలయం బయట మేడారం వేదికగా సమావేశం జరుగుతోంది. కేబినెట్ సమావేశం మేడారంలో పెట్టడం ద్వారా జాతరకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత తెలియజేస్తుందని మంత్రి వర్గం అంటోంది.
మేడారం జాతరను రాష్ట్ర పండుగగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించినప్పటికీ సెలవుగా ప్రకటించని ప్రభుత్వం.. కేబినెట్ సమావేశంలో స్టేట్ హాలిడేపై నిర్ణయం తీసుకునే అవకాశ ఉంది. ములుగు నియోజకవర్గం అభివృద్ధిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లపై డెడికేషన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్‌కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై రిటైర్డ్ జడ్జితో కమిషన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.


