
ఎస్‌ఎస్‌తాడ్వాయి: ములుగు జిల్లా మేడారంలోని శ్రీసమ్మక్క–సారలమ్మ ఆలయాన్ని మరో మూడు నెలల పాటు మూసివేయనున్నట్లు పూజారులు, మేడారం గిరిజన అభ్యుదయ సంఘం యువకులు ప్రకటించారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో పలు అంశాలపై చర్చించేందుకు శుక్రవారం వారు సమావేశమయ్యారు. లాక్‌డౌన్ సమయంలో రాష్ట్రంలోని ఆలయాలను మూసివేసి, తిరిగి తెరిచినా మేడారంలో ఆలయాన్ని మాత్రం తెరవలేదు. అయితే, వైరస్ విజృంభణ తగ్గకపోవడంతో మరో మూడు నెలల పాటు ఆలయాన్ని మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయమై కలెక్టర్, స్థానిక అధికారులకు మేడారం సర్పంచ్ చిడ్డం బాబూరావు లేఖ అందజేశారు.