అడవిలో నిప్పు.. ఎగసిపడిన మంటలు | - | Sakshi
Sakshi News home page

అడవిలో నిప్పు.. ఎగసిపడిన మంటలు

Feb 3 2026 7:11 AM | Updated on Feb 3 2026 7:11 AM

అడవిల

అడవిలో నిప్పు.. ఎగసిపడిన మంటలు

పెనుకొండ: స్థానిక పులేకమ్మ అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే అటవీ ప్రాంతానంతా వ్యాపించాయి. మంటలు ఎగసిపడటంతో పచ్చని చెట్లు బూడిదయ్యాయి. అడవిని ఆవాసంగా చేసుకుని బతుకుతున్న వన్యప్రాణాలూ మంటల్లో కాలి మృత్యువాతపడ్డాయి. దట్టమైన పొగ జాతీయ రహదారిని కమ్మేయగా...వాహనాదారులు ఇబ్బందులు పడ్డారు. కళ్లముందే కాలిపోతున్న అటవీ ప్రాంతాన్ని, వన్యప్రాణులను చూసి ప్రకృతి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ ప్రాంతమంతా బోధ గడ్డి ఉండటంతో మంటలు వేగంగా వ్యాప్తి చెందాయని, అందువల్ల బోధగడ్డిని తొలగించడంతో పాటు అటవీ ప్రాంతానికి ట్రెంచ్‌లు చేస్తే బాగుంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

అడవిలో నిప్పు.. ఎగసిపడిన మంటలు 1
1/1

అడవిలో నిప్పు.. ఎగసిపడిన మంటలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement