ఢిల్లీని తాకిన ఉపాధ్యాయుల సెగ | - | Sakshi
Sakshi News home page

ఢిల్లీని తాకిన ఉపాధ్యాయుల సెగ

Feb 6 2026 7:34 AM | Updated on Feb 6 2026 7:34 AM

ఢిల్ల

ఢిల్లీని తాకిన ఉపాధ్యాయుల సెగ

పుట్టపర్తి: ఉపాధ్యాయుల సమస్యల సెగ ఢిల్లీని తాకింది. పలు సమస్యల పరిష్కారం కోసం ఎస్టీయూ సంఘం నేతలు డిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేసినట్లు జిల్లా శాఖ అధ్యక్షుడు గజ్జల హరిప్రసాద్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామానుజులు యాదవ్‌ తెలిపారు. 2010 కంటే ముందు నియామకం పొందిన 30 లక్షల మంది ఉపాధ్యాయులకు టెట్‌ పరీక్ష మినహాయింపు ఇవ్వాలంటూ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, పలు ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ వేశాయని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ వేయాలన్నారు. లేదా పార్లమెంట్‌ లో చట్టం చేయాలన్నారు.

నేటి నుంచి గ్రామోత్సవ్‌

అనంతపురం అగ్రికల్చర్‌: స్థానిక సాయినగర్‌లో ఉన్న అంబేడ్కర్‌ భవన్‌ వేదికగా శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ‘అనంత గ్రామీణ మహోత్సవం’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నాబార్డు డీడీఎం అనురాధ ఒక ప్రకటనలో తెలిపారు. నాబార్డు, నేస్తం ఎన్‌జీఓ సంయుక్తంగా 6 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించే కార్యక్రమాల్లో వివిధ జిల్లాల నుంచి నేతన్నలు, ఎస్‌హెచ్‌జీ, రైతులు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. ఇందులో గ్రామీణ ప్రాంత ఉత్పత్తులు, ఆభరణాలు, పనిముట్ల ప్రదర్శన, అమ్మకాలు ఉంటాయన్నారు. నాబార్డు ఉన్నతాధికారులతో పాటు వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులతో పాటు రూడ్‌సెట్‌, గ్రామీణ బ్యాంకు అధికారులు పాల్గొంటారన్నారు. ఈ అవకాశాన్ని నగర వాసులతో పాటు ఉమ్మడి జిల్లా రైతులు, మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఫైళ్లన్నీ ఈ–ఆఫీస్‌ ద్వారానే పంపాలి

జాయింట్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌

మడకశిర: పనుల్లో వేగవంతం, పారదర్శకత కోసం ఇక నుంచి ఫైళ్లన్నీ ఈ–ఆఫీస్‌ ద్వారానే పంపాలని జాయింట్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన పట్టణంలోని ఆర్డీఓ, తహసీల్దార్‌ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసి వివిధ విభాగాలను పరిశీలించారు. ఉద్యోగుల హాజరు పట్టికను పరిశీలించి.. సమయపాలన పాటించాలని ఆదేశించారు. అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ.. ఫైళ్ల క్లియరెన్స్‌లో పారదర్శకత పాటించేందుకే ఈ– ఆఫీస్‌ను ప్రవేశపెట్టామన్నారు. పాత రికార్డులన్నీ భద్రపరచాలని ఆదేశించారు. కార్యాలయాల ప్రాంగణాలు, రికార్డు గదులను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఆర్డీఓ కార్యాలయాన్ని పరిశీలించి... నూతన కార్యాలయ ఏర్పాట్లపై సమీక్షించారు. మడకశిర రెవెన్యూ సబ్‌ డివిజన్‌కు సంబంధించిన రికార్డులన్నీ పెనుకొండ ఆర్డీఓ కార్యాలయం నుంచి మడకశిర కార్యాలయానికి వెంటనే తరలించాలని ఆర్డీఓను ఆదేశించారు. మ్యుటేషన్‌, డిజిటల్‌ రికార్డులను పరిశీలించారు. రిజిస్టర్ల నిర్వహణను కూడా పరిశీలించారు. జేసీ వెంట ఆర్డీఓ ఆనందకుమార్‌, తహసీల్దార్‌ కళ్యాణచక్రవర్తి తదితరులు ఉన్నారు.

ఢిల్లీని తాకిన ఉపాధ్యాయుల సెగ 
1
1/1

ఢిల్లీని తాకిన ఉపాధ్యాయుల సెగ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement