ద్రోహానికి ప్రతిరూపం చంద్రబాబు | - | Sakshi
Sakshi News home page

ద్రోహానికి ప్రతిరూపం చంద్రబాబు

Feb 6 2026 7:34 AM | Updated on Feb 6 2026 7:34 AM

ద్రోహానికి ప్రతిరూపం చంద్రబాబు

ద్రోహానికి ప్రతిరూపం చంద్రబాబు

ధర్మవరం: కరువుసీమ రైతులకు వరదాయనిగా భావించే రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులను నిలివేసిన చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి దగ్గర ప్రజల భవిష్యత్‌ను తాకట్టు పెట్టారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కరువు ప్రాంత రైతులకు తీవ్ర అన్యాయం చేసిన చంద్రబాబు వైఖరికి నిరసనగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో గురువారం తలపెట్టిన ‘చలో పోతిరెడ్డిపాడు’ కార్యక్రమానికి ఆయన ధర్మవరం నుంచి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి మాట్లాడుతూ... రాయలసీమ ప్రజలకు ఎంతో ఉపయుక్తమైన రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులను ఆపడం దుర్మార్గమన్నారు. వైఎస్‌ జగన్‌ హయాంలో ప్రారంభమైన ‘రాయలసీమ లిఫ్ట్‌’ పనులను తాను చెబితేనే చంద్రబాబు ఆపారని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా పేర్కొనడం చూస్తే చంద్రబాబు కుట్ర రాజకీయాలు బహిర్గతమయ్యాయన్నారు. సీమ ప్రజలకు అన్యాయం చేస్తూ చంద్రబాబు చేస్తున్న దుర్మార్గపు రాజకీయాలను ప్రజలంతా ఎండగట్టాలన్నారు. గతంలో కూడా సీఎం చంద్రబాబు ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచి కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఖండించకుండా మౌనంగా ఉండటం వల్ల రాయలసీమకు అన్యాయం జరిగిందన్నారు. తాజాగా రాయలసీమ లిఫ్ట్‌ ప్రాజెక్టును ఆపడం ద్వారా మనకు రావాల్సిన నీటిని తెలంగాణ ప్రభుత్వం యథేచ్ఛగా వాడుకుంటోందన్నారు. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులను కొనసాగించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపడుతున్న ‘చలో పోతిరెడ్డి పాడు’ కార్యక్రమం ఆరంభం మాత్రమేనని భవిష్యత్‌లో డిమాండ్‌లు సాధించుకునే వరకు పోరాటం ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మున్సిపల్‌ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందమూరి నారాయణరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు గడ్డం కుళ్లాయప్ప, పెద్దిరెడ్డిగారి శ్రీనివాసులు, చెలిమి రామయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు మాసపల్లి సాయికుమార్‌, రాష్ట్ర, జిల్లా నాయకులు గుర్రం శ్రీనివాస్‌రెడ్డి, వేముల అమర్‌నాథ్‌రెడ్డి, గజ్జల శివ, జింకా కంబగిరి, రెడ్డివారి రాజశేఖర్‌రెడ్డి, ఆవుల పోతిరెడ్డి, మద్దిలేటి మల్లికార్జున, కత్తె పెద్దన్న, కేశగాళ్ల కృష్ణ, చింతా భాస్కర్‌రెడ్డి, ఆకుల రామలింగ, అశోక్‌కుమార్‌రెడ్డి, అడ్రా నారాయణస్వామి, చంద్ర, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తన స్వార్థ రాజకీయం కోసం

రైతుకు అన్యాయం

సీమ ప్రజల భవితను

రేవంత్‌ దగ్గర తాకట్టుపెట్టాడు

‘చలో పోతిరెడ్డిపాడు’ ఆరంభం మాత్రమే

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement