గుర్తు తెలియని మహిళ మృతి
మడకశిర రూరల్: మండలంలోని గౌరీపురం గ్రామ సమీపంలో ప్రధాన రహదారిపై సోమవారం తెల్లవారుజామున వాహనం ఢీ కొని ఓ గుర్తు తెలియని మహిళ (40) మృతి చెందింది. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వాహనంతో పాటు ఉడాయించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడు చేరుకుని పరిశీలించారు. మృతురాలి ఆచూకీ కోసం చుట్టుపక్కల గ్రామాల ప్రజలను ఆరా తీశారు. యాచకురాలుగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. మహిళ ఆచూకీ తెలిసిన వారు 94901 12475, 94405 53820 కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.


