సీఎం, డిప్యూటీ సీఎంలపై చర్యలు తీసుకోండి
పుట్టపర్తి: ‘కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి భక్తుల మనోభావాలతో చెలగాటమాడటం తగదు. పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ అయిందని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ అసత్య ప్రచారం చేస్తున్నారు. దర్యాప్తు సంస్థల విచారణలో నెయ్యి కల్తీ కాలేదని తేల్చినా దుష్ప్రచారానికి తెగబడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి’ అని వైఎస్సార్‌సీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఇందులో భాగంగానే మంగళవారం మడకశిరలో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త ఈరలక్కప్ప ఆధ్వర్యంలో నాయకులు స్థానిక ప్రభుత్వాస్పత్రి నుంచి అర్బన్ అప్‌గ్రేడ్ పోలీసుస్టేషన్ వరకూ ర్యాలీగా వెళ్లి ఎస్‌ఐ లావణ్యకు, కదిరిలో వైఎస్సార్‌సీపీ నాయకులు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడి చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు.
పోలీసుస్టేషన్‌లో
వైఎస్సార్‌సీపీ నాయకుల ఫిర్యాదు
సీఎం, డిప్యూటీ సీఎంలపై చర్యలు తీసుకోండి


