పోలీసు సిబ్బందికి క్రమ శిక్షణ అవసరం
పుట్టపర్తి టౌన్: పోలీస్‌శాఖలో అంకితా భావంతో విధులు నిర్వర్థించాలంటే క్రమశిక్షణ చాలా అవసరమని ఎస్పీ సతీష్‌కుమార్ తెలిపారు. పుట్టపర్తి పోలీస్ కార్యాలయం సమీపంలో పరేడ్ మైదానంలో మంగళవారం ఏఆర్ డీ మొబలైజేషన్ ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ సతీష్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరై పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పరేడ్‌ను పరిశీలించారు. విధుల్లో ప్రతిభ కనబరిచిన ఏఆర్ సిబ్బందిని అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఎస్పీ మాట్లాడుతూ ఆరోగ్యం, దేహదారుడ్యం మెరుగుపర్చుకునేందుకు 15 రోజుల డీ మొబలైజేషన్ ప్రోగ్రాం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమానికి అన్ని విభాగాల నుంచి 87 శాతం మంది హాజరుకావడం అభినందనీయమన్నారు. విధి నిర్వహణలో క్లిష్ట పరిస్థితులు ఎలా ఎదుర్కోవాలనే అంశాలను తెలుసుకోవచ్చన్నారు. విధుల్లో తప్పులు చేస్తే మాత్రం చర్యలు తప్పవన్నారు. ప్రతి మూడో శనివారం ఏఆర్ సిబ్బంది సమస్యలపై తనను సంప్రదించవచ్చని సూచించారు. అనంతరం ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్‌ఐలను ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్‌ఐలు వలి, మేహేష్, రవికుమార్, ఆర్‌ఎస్‌ఐలు ప్రదీప్‌సింగ్, వెంకటేశ్వర్లు, ప్రసాద ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్పీ సతీష్‌కుమార్
పోలీసు సిబ్బందికి క్రమ శిక్షణ అవసరం


