నేత్రదానంతో ఇద్దరికి వెలుగు | - | Sakshi
Sakshi News home page

నేత్రదానంతో ఇద్దరికి వెలుగు

Feb 4 2026 6:59 AM | Updated on Feb 4 2026 6:59 AM

నేత్రదానంతో ఇద్దరికి వెలుగు

నేత్రదానంతో ఇద్దరికి వెలుగు

ధర్మవరం అర్బన్‌: నేత్రదానంతో ఇద్దరికి కంటిచూపును అందించవచ్చని విశ్వదీప సేవా సంఘం వ్యవస్థాపకుడు కోళ్లమొరం చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ధర్మవరం పట్టణంలోని పీఆర్‌టీవీధికి చెందిన అంబాభవాని ఆలయం మాజీ అధ్యక్షుడు సఫారు లక్ష్మణరావు(78) మంగళవారం అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న విశ్వదీప సేవా సంఘం సభ్యులు మృతుని కుటుంబ సభ్యులను కలిసి నేత్రదానంపై అవగాహన కల్పించడంతో వారు అంగీకరించారు. జిల్లా అంధత్వ నివారణ సంస్థ, ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ డాక్టర్‌ కుళ్లాయప్ప, కంటి రెట్రావైల్‌ సెంటర్‌ టెక్నీషియన్‌ రాఘవేంద్ర మృతుని కంటి కార్నియాను సేకరించారు. నేత్రదానానికి సహకరించిన మృతుని భార్య జయలక్ష్మి, కుమారుడు శివరాంమూర్తి, కుమార్తె భారతి, కోడలు చైతన్య, కుటుంబ సభ్యులు , విశ్వదీప సేవా సంఘం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో విశ్వదీప సేవా సంఘం అధ్యక్షుడు గాజుల సురేష్‌, ఉపాధ్యక్షులు చంద్రశేఖర్‌రెడ్డి, కార్యదర్శి జుజారు రఘు, సభ్యులు ధనుంజయ, వెంకటేష్‌, కేశవరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement