సేవాలాల్‌ ఆశయాలు కొనసాగిద్దాం | - | Sakshi
Sakshi News home page

సేవాలాల్‌ ఆశయాలు కొనసాగిద్దాం

Feb 4 2026 6:59 AM | Updated on Feb 4 2026 6:59 AM

సేవాలాల్‌ ఆశయాలు కొనసాగిద్దాం

సేవాలాల్‌ ఆశయాలు కొనసాగిద్దాం

పుట్టపర్తి టౌన్‌: సేవాలాల్‌ మహారాజ్‌ ఆశయాలను కొనసాగిద్దామని కలెక్టర శ్యాంప్రసాద్‌, ఆల్‌ ఇండియా బంజార భక్త సేవా సంఘం నాయకులు పిలుపునిచ్చారు. పుట్టపర్తిలో మంగళవారం ఆల్‌ ఇండియా బంజార భక్త సేవా సంఘం (ఏబీబీఎస్‌ఎస్‌) ఆధ్వర్యంలో సేవాలాల్‌ మహారాజ్‌ జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ ముఖ్యఅతిథిగా హాజరై సేవాలాల్‌ మహారాజ్‌, సత్యసాయిబాబా చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జెండా ఊపి సేవాలాల్‌ మహారాజ్‌ రథయాత్రను ప్రారంభించారు. బంజారా సాంప్రదాయ నృత్యాలు, డప్పులు, గిరిజన పాటలతో పట్టణం మార్మోగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ బంజార మహిళలతో కలసి నృత్యం చేశారు. సేవాఘడ్‌ ట్రస్ట్‌ అధ్యక్షుడు మహారాజ్‌స్వామి, జనరల్‌ సెక్రటరీ అశ్వర్థనాయక్‌, డంగావత్‌ రమేష్‌నాయక్‌, అఖిల భారత సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు అంజీనాయక్‌, గిరిజన ప్రజ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మల్లికార్జుననాయక్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ శివకుమార్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement