లక్ష్యాలను సాధించాలి | - | Sakshi
Sakshi News home page

లక్ష్యాలను సాధించాలి

Feb 4 2026 6:59 AM | Updated on Feb 4 2026 6:59 AM

లక్ష్

లక్ష్యాలను సాధించాలి

ప్రశాంతి నిలయం: జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు అన్ని శాఖలకు కీ పెర్ఫార్మెన్స్‌ ఇండికేటర్స్‌ను ప్రభుత్వం నిర్ణయించినట్లు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ అధికారులకు తెలియజేశారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో జిల్లా అధికారులకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇండికేటర్స్‌ను ప్రతి నెలా 5వ తేదీ లోపు స్వర్ణాంధ్ర పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. ఇండికేటర్స్‌ వారీగా లక్ష్యాలను సాధించాలన్నారు. బీ గ్రేడ్‌, సీ గ్రేడ్‌లో ఉన్న జిల్లా శాఖ అధికారులను వారికి సంబంధించిన శాఖలను మెరుగైన గ్రేడ్‌ సాధించేందుకు వీలుగా పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో జేసీ మౌర్య భరద్వాజ్‌, డీఆర్‌ఓ సూర్యనారాయణరెడ్డి, సీపీఓ విజయ్‌కుమార్‌, అన్నిశాఖల అధికారులు పాల్గొన్నారు.

ఇంటర్‌ ప్రాక్టికల్స్‌కు

108 మంది గైర్హాజరు

పుట్టపర్తి అర్బన్‌: జిల్లా వ్యాప్తంగా 32 కళాశాలల్లో జనరల్‌, ఒకేషనల్‌ విద్యార్థులకు ప్రాకికల్స్‌ పరీక్షలు జరుగుతున్నాయి. మంగళవారం జరిగిన పరీక్షలకు 108 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్‌ మీడియట్‌ విద్యాశాఖాధికారి చెన్నకేశవప్రసాద్‌ తెలిపారు. జనరల్‌లో 2035 మంది విద్యార్థులకు 1976 మంది, ఒకేషనల్‌లో 1453 మందికి 1413 మంది విద్యార్థులు ప్రాక్టికల్స్‌ పరీక్షలకు హాజరైనట్లు పేర్కొన్నారు.

మహిళా సంక్షేమానికి ప్రాధాన్యం

పుట్టపర్తి టౌన్‌: జిల్లా వ్యాప్తంగా మహిళా సంక్షేమం, భద్రత, చేయూతకు పెద్ద పీట వేస్తున్నట్లు ఎస్పీ సతీష్‌కుమార్‌ పేర్కొన్నారు. మంగళవారం పుట్టపర్తి పట్టణంలో ఉన్న డీఎస్పీ కార్యాలయంలో మహిళా సమస్యల పరిష్కారం కోసం దాతల సహకారంతో ఏర్పాటు చేసిన ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ సెంటర్‌, రిసెప్సన్‌ కౌంటర్‌ను ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధిత మహిళలకు కౌన్సెలింగ్‌ ఇవ్వడానికి లాయర్‌, స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులు, పోలీస్‌ మహిళా ప్రతినిధులతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని సబ్‌ డివిజన్లలో ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మొదటగా కదిరిలో ప్రారంభించామని 27 ఫిర్యాదులు రాగా 16 పరిష్కారమైనట్లు చెప్పారు. ఇందులో భాగంగా పుట్టపర్తిలో ఏర్పాటు చేశామన్నారు. 24 గంటలు సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. డీఎస్పీ విజయకుమార్‌, సీఐలు శ్రీనివాసులు, సురేష్‌, ఎస్‌ఐలు మల్లికార్జునరెడ్డి, గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

వేతనాల పెంపు ఇంకెప్పుడు?

పుట్టపర్తి అర్బన్‌: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 2025–26 బడ్జెట్‌లో అంగన్‌వాడీల వేతనాల పెంపు, స్కీం నిర్వహణకు సరిపోని విధంగా బడ్జెట్‌ కేటాయించడం దుర్మార్గమని ఉద్యోగుల జేఏసీ జిల్లా అధ్యక్షుడు ఓబిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐటీయూ ఆలిండియా కమిటీ పిలుపు మేరకు మంగళవారం బుక్కపట్నం మండల కేంద్రంలో అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులతో కలిసి బడ్జెట్‌ కాపీలను తగులబెట్టారు. ఓబిరెడ్డి మాట్లాడుతూ కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో దేశ వ్యాప్తంగా 26 లక్షల మంది అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లతో సహా కోటి మంది స్కీం వర్కర్ల హక్కులను కాలరాసిందన్నారు. ఎంతో కాలంగా వేతనాల కోసం పోరాటాలు చేస్తున్నా పట్టించుకోలేదన్నారు. మౌలిక సదుపాయాలకు సైతం ఈ బడ్జెట్‌ సరిపోదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ యూనియన్‌ అధ్యక్షురాలు సుజాత, కార్యదర్శి నాగమణి, జ్యోతి, పద్మ, శ్యామల, గంగ, సౌమ్య, నాగరత్న, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.

లక్ష్యాలను సాధించాలి 1
1/2

లక్ష్యాలను సాధించాలి

లక్ష్యాలను సాధించాలి 2
2/2

లక్ష్యాలను సాధించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement